News July 22, 2024

అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి.. అసలేం జరిగిందంటే.?

image

తెనాలిలోని ఐతానగర్‌కు చెందిన వైద్యురాలు హారిక(24) అమెరికాలో పశువైద్య విభాగంలో MS చేస్తున్నారు. గత ఆగస్టులో అక్కడికి వెళ్లిన ఆమె ఆదివారం ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. అసలేం జరిగిందంటే.. హారిక విధుల అనంతరం సహచరులతో కలిసి కారులో ఇంటికి బయల్దేరారు. వీరి వాహనం ముందు బైకు కిందపడటంతో కారు నిలిపేశారు. దీంతో వెనక నుంచి వస్తున్న 3వాహనాలు హారిక కారును ఢీకొనగా, వెనక కూర్చున్న ఆమె మృతిచెందారు.

Similar News

News November 10, 2025

దళిత ఉద్యమ కెరటం డాక్టర్ కత్తి పద్మారావు

image

సాహిత్యం, దళిత ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి కత్తి పద్మారావు అని BR అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఘంటా చక్రపాణి, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చంద్రశేఖరరెడ్డి అన్నారు. విమలా స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారం-2025 పద్మారావుకు ప్రకటించారు. నిన్న అనంతపురంలో జరిగిన సభకు అనివార్య కారణాల వల్ల పద్మారావు హాజరుకాలేదు. పురస్కారాన్ని ఆయన కుమారుడు చేతన్ అందుకున్నారు.

News November 10, 2025

గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్‌కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.