News July 22, 2024
మరో 107 రోజులే.. కలిసి పోరాడుదాం: కమలా హారిస్

US అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ తనను నామినేట్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. బైడెన్ నిస్వార్థంగా దేశానికి సేవలు అందించారని కొనియాడారు. డెమోక్రటిక్ పార్టీలో, దేశంలో ఐక్యత తెచ్చేందుకు తన శక్తి మేరకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఎన్నికలకు మరో 107 రోజులే ఉందని, అందరం కలిసికట్టుగా పోరాడి విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
Similar News
News September 13, 2025
ఈడీ విచారణపై స్పందించిన మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు చేయడంపై నటి మంచు లక్ష్మి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘చిట్టచివరి వ్యక్తి వద్దకు వచ్చి విచారణ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ముందు దీన్ని ఎవరు ప్రారంభించారో చూడండి. అసలు డబ్బు ఎక్కడికెళ్తుందో ఈడీ విచారించింది. టెర్రరిస్టులకు యాప్స్ ఫండింగ్ చేయడంపై మాకేమీ తెలియదు. 100పైగా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో నేనూ చేశానంతే’ ’ అని ఆమె తెలిపారు.
News September 13, 2025
అహంకారం వినాశనానికి కారణం

రావణుడు విద్యావంతుడు, గొప్ప పండితుడు, శివ భక్తుడు. ఆయనకు పాలనలోనూ మంచి పరిజ్ఞానం ఉంది. అయితే, అహంకారం, దుర్గుణాలు ఆయన పతనానికి కారణమయ్యాయి. ధర్మం బోధించిన భార్య మండోదరి మాటలను సైతం రావణుడు పెడచెవిన పెట్టాడు. తన అహంకారం కారణంగా సీతను అపహరించి, చివరకు తన సామ్రాజ్యాన్ని కోల్పోయి, నాశనమయ్యాడు. ఎంత గొప్ప వ్యక్తికైనా దుర్గుణాలు, అహంకారం అపారమైన నష్టాన్ని కలిగిస్తాయని రావణుడి జీవితం తెలియజేస్తోంది.
News September 13, 2025
మీకు ‘చిన్న తిరుపతి’ తెలుసా?

AP: ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ‘ద్వారకా తిరుమల’. ఇక్కడ స్వామివారు వెంకన్న రూపంలో కొలువై ఉన్నారు. ఇది ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామిని దర్శించుకుంటే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో రెండు విగ్రహాలు ఉంటాయి. ఒకటి సంతానానికి, మరొకటి పెళ్లి సంబంధాలకు ప్రతీకగా భావిస్తారు. ఇక్కడ స్వామివారు స్వయంభువుగా వెలిశారని చెబుతారు.