News July 22, 2024

‘మీ భర్త ఎవరో చెప్పండి’: శాంతికి నోటీసులు

image

AP: దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ <<13630730>>శాంతి<<>>, YCP MP విజయసాయి రెడ్డిపై చేసిన <<13638248>>ఆరోపణలు<<>> చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తాజాగా ‘మీ భర్త ఎవరో వివరణ ఇవ్వండి’ అంటూ శాంతికి దేవదాయ శాఖ నోటీసులు ఇచ్చింది. ‘ఉద్యోగంలో చేరినప్పుడు భర్త పేరు మదన్‌మోహన్ అని పేర్కొన్నారు. ఇటీవల ప్రెస్‌మీట్‌లో సుభాష్‌ని పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. ఇది ఉద్యోగి ప్రవర్తనా నియమావళికి విరుద్ధం’ అని నోటీసుల్లో పేర్కొంది.

Similar News

News September 18, 2025

APకి 13వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు

image

AP: రాష్ట్రానికి 13,050 మెట్రిక్ ట‌న్నుల యూరియా కేటాయిస్తూ కేంద్రం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్టు ద్వారా యూరియా రాష్ట్రానికి చేరనుంది. కాగా ఈ కేటాయింపుతో రైతులకు మ‌రింత‌ వెసులుబాటు కలుగుతుందని వ్య‌వ‌సాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని, రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయన్నారు.

News September 18, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పట్టణ రవాణా శాఖ)గా బాధ్యతలు.. CM రేవంత్‌ను కలిసిన NVS రెడ్డి
* SEP 21న చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ ఆడనున్న కల్వకుంట్ల కవిత
* HYDలో భారీ వర్షం.. GHMC, హైడ్రా, పోలీస్, విద్యుత్ విభాగాలు సమన్వయం చేసుకోవాలన్న మంత్రి పొన్నం
* మూసీకి వరద.. అంబర్‌పేట్-మూసారాంబాగ్ బ్రిడ్జి క్లోజ్
* SEP 21-30 వరకు జరిగే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొనాలి: మంత్రి జూపల్లి

News September 18, 2025

రేపు OTTలోకి ‘మహావతార్ నరసింహ’

image

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన ‘మహావతార్ నరసింహ’ సినిమా OTT రిలీజ్ డేట్ ఖరారైంది. రేపటి నుంచి Netflixలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.