News July 22, 2024
ప్రకాశం: మీ MLA ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారు?

నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ గళం వినిపించనుండగా.. వారిలో డోల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఇంటూరి, కొండయ్య, తాటిపర్తి చంద్రశేఖర్ మొదటి సారి గళం వినిపించనున్నారు. మరి మీ MLA అసెంబ్లీలో ఏ సమస్యపై ప్రస్తావించాలనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
Similar News
News July 7, 2025
ఒంగోలు నుంచి వెళ్తుండగా ఉద్యోగి మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సోమవారం ఉదయం చనిపోయారు. ఒంగోలు నుంచి బైకుపై వెళ్తున్న వ్యక్తి జాగర్లమూడివారిపాలెం బ్రిడ్జి వద్ద హైవేపై చనిపోయారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందా? లేదా అదుపుతప్పి ఆయనే కింద పడిపోయారా? అనేది తెలియాల్సి ఉంది. మృతుడు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అని సమాచారం. ఒంగోలు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
News July 7, 2025
ప్రకాశం జిల్లా తొలి కలెక్టర్ ఎవరో తెలుసా?

1972లో ప్రకాశం జిల్లా ఏర్పాటైంది. తొలి కలెక్టర్‌గా కత్తి చంద్రయ్య వ్యవహరించారు. నాగులుప్పులపాడు(M) పోతవరంలో 1924 జులై 7న ఆయన జన్మించారు. మద్రాసులో లా పూర్తి చేసి మధురై జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్, గుంటూరు కలెక్టర్‌గానూ వ్యవహరించారు. ఆయన కుమారుడు, కుమార్తె రత్నప్రభ, ప్రదీప్ చంద్ర సైతం IASలే. తండ్రి, కుమారుడు ఒకే జిల్లా(గుంటూరు)కు కలెక్టర్‌గా పనిచేయడం మరొక విశేషం.
News July 6, 2025
ప్రకాశం జిల్లా వాసులకు SP హెచ్చరిక

ప్రకాశం జిల్లా SP ఏ.ఆర్ దామోదర్ శనివారం పలు PSలలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కనిగిరి PSను సందర్శించి మాట్లాడారు. జిల్లాలో మొహర్రం వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో ఎక్కడైనా శాంతి భద్రతలకు విగాథం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.