News July 22, 2024
నేలకొండపల్లి: నాన్నకు ప్రేమతో విగ్రహం చేయించిన కుమారులు

తండ్రి కన్నుమూసినా ఎప్పటికీ తమ కళ్ల ముందే ఉండాలని ఆయన కుమారులు తండ్రి విగ్రహాన్ని చేయించారు. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గుండపనేని పరాంకుశ రావు ఏడాది క్రితం మృతి చెందాడు. ఆయన కుమారులు రాంచందర్ రావు, లక్ష్మణరావు ఎప్పటికీ తమ కళ్ల ముందే తండ్రి రూపం ఉండాలనే భావనతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రూ.80 వేలతో ఆయన విగ్రహం చేయించి తమ పొలంలో మందిరం నిర్మించారు.
Similar News
News September 12, 2025
ఖమ్మం: అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష

ఖమ్మం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేషన్, పంచాయతీ రాజ్, ఆర్&బి, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, ట్రైబల్ వెల్ఫేర్, మున్సిపాలిటీ వంటి శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రస్తుత పనులపై వివరాలు తెలుసుకున్నారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.
News September 11, 2025
బీసీల కులగణనలో తెలంగాణ ఆదర్శం: పొంగులేటి

బీసీల కులగణనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లపై మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమీక్షా నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
News September 11, 2025
ఖమ్మం ఐటీ హబ్‌లో ప్లేస్‌మెంట్ డ్రైవ్

ఖమ్మం ఐటీ హబ్‌లో ఈ నెల 15న టాస్క్ ఆధ్వర్యంలో టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుందని జిల్లా మేనేజర్ దినేష్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో బీటెక్ లేదా డిగ్రీలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ డ్రైవ్‌కు అర్హులని అన్నారు. ఆసక్తి ఉన్నవారు తమ రెజ్యూమ్, సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7981093223 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.