News July 22, 2024

ఒలింపిక్స్‌లో ఇజ్రాయెల్ అథ్లెట్లను స్వాగతించం: ఫ్రాన్స్ ఎంపీ

image

పారిస్‌లో జరిగే ఒలింపిక్స్-2024 క్రీడలకు వచ్చే ఇజ్రాయెల్ అథ్లెట్లకు తాము స్వాగతం పలకబోమని ఫ్రాన్స్ ఎంపీ థామస్ పోర్టెస్ ప్రకటించారు. ‘గాజాలో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ జాతీయ పతాకం, జాతీయ గీతంపై ఒలింపిక్స్‌లో నిషేధం విధించేలా ప్రజా ప్రతినిధులు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీపై ఒత్తిడి తీసుకురావాలి. రష్యా తరహాలోనే ఇజ్రాయెల్‌నూ చూడాలి’ అని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యల్ని ఫ్రాన్స్ యూదుల గ్రూప్ ఖండించింది.

Similar News

News November 3, 2025

THDCలో 40 ఉద్యోగాలు

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్(THDC) 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి BSc, బీటెక్, BE, MBBS అర్హతగల అభ్యర్థులు NOV 7 నుంచి DEC 6వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.600. SC, ST, PWBDలకు ఫీజు లేదు. స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://thdc.co.in

News November 3, 2025

డిజిటల్ అరెస్టుల పేరిట ₹3వేల కోట్ల లూటీ

image

దేశంలో డిజిటల్ అరెస్టుల పేరిట ₹3వేల కోట్ల లూటీ జరిగిందని హోమ్ శాఖ సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ స్కామ్‌ ఛాలెంజింగ్‌గా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని ఉక్కుపాదంతో అణచివేయాల్సిన అవసరముందని న్యాయమూర్తులు సూర్యకాంత్, ఉజ్జల్ భూయాన్, JM బాగ్చి అభిప్రాయపడ్డారు. దీనిపై త్వరలోనే ఆదేశాలిస్తామన్నారు. కాగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ మోసాలపై విచారణ బాధ్యతను CBIకి అప్పగించాలని కోర్టు భావిస్తోంది.

News November 3, 2025

శివలింగానికి కుంకుమ పెడుతున్నారా..?

image

శివలింగానికి చాలామంది భక్తులు కుంకుమ పెడుతుంటారు. కానీ అలా పెట్టడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు చెబుతున్నారు. శివలింగానికి విభూది, గంధం మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. ‘పరమశివుడు గాఢమైన ధ్యానంలో ఉంటారు. ఎరుపు రంగులో ఉండే కుంకుమ వేడిని పెంచుతుంది. అందుకే ఆయన శరీరానికి చల్లదనాన్ని, ప్రశాంతతను ఇచ్చే చందనాన్ని మాత్రమే సమర్పించాలి. శివారాధనలో కుంకుమకు బదులు గంధం వాడటం అత్యంత ముఖ్యం’ అంటున్నారు.