News July 22, 2024

మెగా ఫ్యాన్స్‌కు పండగే!

image

మరికొన్ని నెలల్లో మెగా ఫ్యాన్స్‌కు సినిమాల పండగ రానుంది. నెల రోజుల వ్యవధిలో 3 పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. డిసెంబర్ 6న అల్లు అర్జున్ ‘పుష్ప-2’, డిసెంబర్ 20 లేదా క్రిస్మస్‌కు రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్, జనవరి 10న చిరంజీవి ‘విశ్వంభర’ విడుదల కానున్నాయి. ఈ 3 సినిమాలపై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరి వీటిలో ఏ మూవీ కోసం మీరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు? కామెంట్ చేయండి.

Similar News

News February 2, 2026

కుసుమలో పేనుబంక, శనగపచ్చ పురుగు నివారణ

image

రబీ సీజన్‌లో సాగు చేస్తున్న కుసుమ పంట పూత దశలో పేనుబంక తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ 2ML లేదా ఎసిఫేట్ 1.5గ్రాములను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కుసుమను శనగపచ్చ పురుగు ఆశిస్తే దీని నివారణకు లీటరు నీటిలో క్లోరోపైరిఫాస్ 25 ఇసి 2.5ML లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News February 2, 2026

ఆడపిల్లలు గడపపై కూర్చుకూడదా?

image

ఇంటి ప్రధాన ద్వారం గడపను లక్ష్మీదేవి నివాసస్థానంగా భావిస్తారు. అందుకే గడపపై ఆడపిల్లలు కూర్చోవడం లక్ష్మీదేవిని అగౌరవ పరిచినట్లవుతుందని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించి, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, కుటుంబ కలహాలు తలెత్తే అవకాశం ఉంది. గడపపై కాలు పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై ఇల్లు వీడుతుందని నమ్మకం. ఇంటి పురోగతిని కోరేవారు ఇలాంటి పనులు చేయకూడదు.

News February 2, 2026

364 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(UCIL) 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల వారు ఫిబ్రవరి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in