News July 22, 2024

HYD: మూడ్రోజు‌లు సెలవులు ఇవ్వాలని డిమాండ్

image

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు నిత్యం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని BC సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలలకు 3 రోజులు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరో 3 రోజులు వానలు పడతాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని హైదరాబాద్‌ వేదికగా సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Similar News

News September 12, 2025

HYD: ఎమ్మెల్యేల వివరణను బీఆర్ఎస్‌కు పంపిన స్పీకర్

image

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యే వివరణలను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీకి పంపించారు. ‘తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. వారి సమాధానం మీకు పంపుతున్నాం. మీరు మీ అభ్యంతరం, అభిప్రాయం చెప్పాలి’ అని స్పీకర్ కోరారు. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. ఈనెల 13లోగా స్పీకర్‌కు వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 

News September 12, 2025

గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వాణి

image

గాంధీ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా పనిచేసిన డాక్టర్ రాజకుమారిని ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా బదిలీ చేశారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

News September 12, 2025

HYD: వాట్సాప్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదుదారులకు ఎఫ్‌ఐఆర్‌ను వాట్సాప్‌లో పంపించే సరికొత్త విధానానికి సీపీ అవినాష్ మహంతి శ్రీకారం చుట్టారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి బాధితుడికి వాట్సాప్‌లో పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో పోలీసు సేవలు పారదర్శకంగా ఉండటంతో పాటు, ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం, విశ్వాసం పెరుగుతాయని పేర్కొన్నారు.