News July 22, 2024
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కాసేపట్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన బీఏసీ భేటీ జరగనుంది. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనే విషయాలపై నిర్ణయం తీసుకోనున్నారు. రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
Similar News
News March 11, 2025
కెనడా పార్లమెంటు నుంచి కుర్చీ ఎత్తుకెళ్లిన ట్రూడో

కెనడా ప్రధాని, ఎంపీ పదవులకు వీడ్కోలు పలుకుతూ జస్టిన్ ట్రూడో ప్రదర్శించిన సరదా చేష్టలు వైరల్‌గా మారాయి. నాలుక బయటకు చాపుతూ పార్లమెంటు హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి తన కుర్చీని ఆయన ఎత్తుకెళ్లిపోవడం గమనార్హం. ఈ చర్య అసంతృప్తి, ప్రతీకారంతో చేసింది కాదు. పదవి నుంచి దిగిపోయేటప్పుడు అక్కడ ఇలా చేయడం ఓ సరదా ఆనవాయితీ అని తెలిసింది. కెనడా తర్వాతి ప్రధానిగా మార్క్ కార్నీని లిబరల్ పార్టీ ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
News March 11, 2025
FLASH: గ్రూప్-2 ఫలితాలు విడుదల

TG: గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా అభ్యర్థుల మార్కులతో కూడిన జనరల్ ర్యాంక్ <
News March 11, 2025
సంతాన ప్రాప్తి కోసం కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి కత్రినా?

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సందర్శించారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ప్రత్యేక నాగపూజలో పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. అయితే, సంతాన ప్రాప్తి కోసం ఈ పూజ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సర్పాలకు అధిపతి అయిన కార్తికేయుడు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిగా పూజలందుకుంటున్నారు. సంతాన ప్రాప్తికోసం, ఇతర సర్ప దోషాల నివారణకు అనేకమంది ఇక్కడికి వెళ్తుంటారు.