News July 22, 2024
ఉమ్మడి నిజామాబాద్‌లో ఊపందుకున్న వ్యవసాయ పనులు

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో పంటల సాగు ఊపందుకుంది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వ్యవసాయభూములు తడిసి విత్తనాలు వేసుకోవడానికి అనుకూలంగా మారాయి. దీంతో జిల్లాలో నల్లరేగడి భూములు అధికంగా ఉండడంతో రైతులు పత్తి, మొక్కజొన్న, తదితర పంటలు సాగు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొన్నిచోట్ల రైతులు భూమిని దున్ని విత్తనాలు నాటుతున్నారు.
Similar News
News February 9, 2026
NZB: జనసేన బోణీ కొడుతుందా.. యూటర్న్ తీసుకుంటుందా?

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో దిగిన జనసేన ఇక్కడ బోణీ కొడుతుందా? లేక యూ టర్న్ తీసుకుంటుందా? అన్న చర్చ జరుగుతోంది. నగరంలోని 11 డివిజన్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వారికి మద్దతుగా ప్రచారానికి వస్తారని అనుకున్నా అది క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రమంలో పోటీ చేస్తున్న వారు Uటర్న్ తీసుకుని బీజేపీకి మద్దతు పలుకుతారా? లేక బరిలో ఉంటారా? అనేది చూడాల్సిందే.
News February 9, 2026
అశోక్ సాగర్ చెరువులో మహిళ మృతదేహం

ఎడపల్లి మండలం జానకంపేట శివారులో అశోక్ సాగర్ చెరువులో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైన విషయం తెసిందే. ఐతే మృతదేహం ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు. మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్, కమ్యూనిటీ హాల్ ప్రాంతానికి చెందిన అష్రఫ్ బేగం(60)గా గుర్తించినట్లు చెప్పారు.
News February 9, 2026
కమ్మర్‌పల్లి: వాలీబాల్ ఛాంపియన్‌లకు బహుమతుల ప్రదానం

కమ్మర్‌పల్లిలో ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ వాలీబాల్ ఛాంపియన్షిప్-2026 పోటీలు జరిగాయి. బాలికల విభాగంలో నిజామాబాద్-1, మహబూబ్ నగర్-2, కరీంనగర్-3, మెదక్-4 స్థానాల్లో నిలిచాయి. బాలురు విభాగంలో మొదటి బహుమతి వరంగల్, నిజామాబాద్-2, ఖమ్మం-3, రంగారెడ్డి-4 స్థానాలు గెలుచుకున్నాయి. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వీఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి బహుమతులు ఇచ్చారు.


