News July 22, 2024

VZM: ‘విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు’

image

వర్షాకాలంలో విద్యుత్తు ప్రమాదాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఈపీడీసీఎల్ ఎస్.ఈ ఎం.లక్ష్మణరావు సూచించారు. ఉమ్మడి జిల్లాలో 6 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్ సమస్యలపై 1912 టోల్‌ ఫ్రీ నంబరుతో పాటు విజయనగరం సర్కిల్‌లో 94906 10102, టౌన్‌లో 63005 49126, రూరల్‌లో 94409 07289, బొబ్బిలిలో 94906 10122, పార్వతీపురంలో 83320 46778 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News April 25, 2025

VZM: వైఎస్ జగన్‌ను కలిసిన జడ్పీటీసీలు

image

వైసీపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గుర్ల, గజపతినగరం, గంట్యాడ, గరివిడి జడ్పీటీసీలు శీర అప్పల నాయుడు, గార తవుడు, వి.నరసింహమూర్తి, వాకాడ శ్రీనివాసరావు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో గురువారం కలిశారు. వైసీపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జగన్ మోహన్ రెడ్డి సూచించారని జడ్పీటీసీలు తెలిపారు. మాజీ సీఎంను కలిసిన వారిలో రాజాం నియోజకర్గ ఇన్ ఛార్జ్ తలే రాజేశ్ కూడా ఉన్నారు.

News April 24, 2025

రామభద్రపురం : పరీక్షా ఫలితాలు వెలువడకముందే విద్యార్థి సూసైడ్

image

రామభద్రపురం మండలం కొట్టక్కికి చెందిన కర్రి దుర్గాప్రసాద్ (15) మంగళవారం రాత్రి ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ ప్రసాద్ బుధవారం తెలిపారు. టెన్త్ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అవుతానని భయంతో ముందే ఉరివేసుకున్నారు. కుటుంబ సభ్యులు సాలూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. కాగా నిన్న వెలువడిన ఫలితాల్లో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు.

News April 24, 2025

VZM: ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు

image

జిల్లా ఇంటర్ విద్యా శాఖాదికారిగా శివ్వాల తవిటి నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన శ్రీకాకుళంలో RIOగా DOEOగా, మన్యం జిల్లా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ పదోన్నతిపై ఇక్కడ నియమితులయ్యారు. ఇంటర్ విద్యలో RIO, DOEO పోస్టులను కలిపి జిల్లా ఇంటర్ విద్యా శాఖాధికారి పోస్టును ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు.

error: Content is protected !!