News July 22, 2024
ఆ సినిమా చూశాక ఆయనకు వీరాభిమాని అయ్యా: ఎస్.జే సూర్య

మలయాళం మూవీ ‘ఆవేశం’ చూశాక ఫహాద్ ఫాజిల్‌కు వీరాభిమాని అయినట్లు విలక్షణ నటుడు ఎస్.జే సూర్య అన్నారు. ‘రాయన్’ ప్రమోషన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫహాద్‌తో కలిసి నటించే అవకాశం వచ్చిందని, ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ధనుష్ ‘రాయన్’ సినిమాకు ఒక్కరోజులోనే డబ్బింగ్ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ టీమ్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు.
Similar News
News February 4, 2026
త్వరలో దూత-2 వెబ్‌సిరీస్?

కార్తీక్ దండు-నాగ చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో దూత-2 వెబ్‌సిరీస్‌పై చైతూ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ స్క్రిప్ట్‌ను పూర్తి చేశారని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని టాక్. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023లో విడుదలైన దూత వెబ్ సిరీస్ హిట్టయిన విషయం తెలిసిందే.
News February 4, 2026
APPLY NOW: RRBలో 22,195 పోస్టులు

RRB 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గలవారు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.18వేలు చెల్లిస్తారు. CBT, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, మహిళలకు రూ.250. వెబ్‌సైట్: https://www.rrbcdg.gov.in/
News February 4, 2026
ఫేస్‌వాష్ ఎందుకు వాడాలంటే?

కాలుష్యం, సూర్యరశ్మి, మేకప్ ప్రభావం ముఖంపై పడుతుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు ఫేస్‌వాష్ చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే చాలామంది ఫేస్‌వాష్ చెయ్యడానికి సబ్బునే వాడతారు. కానీ సబ్బులో ఉండే రసాయనాల వల్ల ముఖంపై ఉండే pH దెబ్బతింటుదంటున్నారు నిపుణులు. ఫేస్‌వాష్‌లు చర్మాన్ని మృదువుగా శుభ్రపరచడంతో పాటు లోతుగా క్లీన్ చేస్తాయి. ఫేస్‌వాష్ ద్వారా pH బ్యాలెన్స్ సరిగ్గా మెయింటైన్ అవుతుందంటున్నారు నిపుణులు.


