News July 22, 2024

భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

image

TG: భద్రాచలం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుత నీటిమట్టం 48 అడుగులకు చేరిందని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 13.36 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

Similar News

News September 18, 2025

సినీ ముచ్చట్లు!

image

*పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమాలో ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్. పోస్టర్లు రిలీజ్
*నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న ‘అఖండ-2’ షూటింగ్ హైదరాబాద్‌లో సాగుతోంది. ఓ పార్టీ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు.
*‘సైయారా’ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అదరగొడుతోంది. 9.3 మిలియన్ గంటల వ్యూయర్‌షిప్‌తో అత్యధికంగా వీక్షించిన నాన్-ఇంగ్లిష్ ఫిల్మ్‌గా నిలిచింది.

News September 18, 2025

జుట్టు లేని కొబ్బరి కాయను కొట్టకూడదా?

image

దేవుడికి జుట్టు లేని కొబ్బరికాయను కొట్టకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ మన శరీరానికి ప్రతీక. దానిపై ఉన్న పీచు మనలోని అహంకారానికి, జ్ఞానానికి చిహ్నం. భగవంతునికి మన శరీరాన్ని, ఆత్మను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి కొబ్బరికాయ కొడతాం. అందుకే జుట్టు ఉన్న కొబ్బరికాయనే కొట్టి, ఆత్మనివేదన అనే భక్తి మార్గాన్ని అనుసరించాలి. జుట్టు లేని కాయను సమర్పించడం అసంపూర్ణ సమర్పణగా భావిస్తారు.

News September 18, 2025

సాయిబాబా విగ్రహం పాలరాయితోనే ఎందుకు?

image

పాలరాయి ఆధ్యాత్మికంగా స్వచ్ఛతకు, బలానికి ప్రతీక. ఈ లక్షణాలు బాబా బోధనలకు అనుగుణంగా ఉంటాయి. పాలరాయి విగ్రహం ఉన్న చోట ప్రశాంతమైన, సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇది సహజమైనది, ప్రాసెస్ చేయనిది కావడంతో పవిత్రంగా పూజా మందిరాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అనేక ఆలయాల్లోనూ పాలరాయితో చేసిన సాయిబాబా విగ్రహాలే మనకు దర్శనమిస్తుంటాయి.