News July 22, 2024
నష్టపోతే మళ్లీ ఇటువైపే చూడరు!

రిటైల్ ఇన్వెస్టర్ల పొదుపు ఉత్పాదకతను పెంచే బాధ్యత స్టాక్ మార్కెట్ వర్గాలపై ఉందని CEA అనంత నాగేశ్వరన్ అన్నారు. అత్యాశతోనే వారు డెరివేటివ్స్ ట్రేడింగ్ చేపట్టి నష్టపోతున్నారని హెచ్చరించారు. ‘ఇది కేవలం దేశ ప్రయోజనమే కాదు. స్వప్రయోజనం కూడా. ఒకసారి భారీగా నష్టపోతే చిన్న ఇన్వెస్టర్లు మళ్లీ క్యాపిటల్ మార్కెట్ల వైపే చూడరు. ఇది వారికీ, ఎకానమీకీ నష్టం’ అని ఆర్థిక సర్వే విడుదలకు ముందు అన్నారు.
Similar News
News September 16, 2025
కోహ్లీ బయోపిక్ డైరెక్ట్ చేయను: అనురాగ్ కశ్యప్

కోహ్లీ అంటే అభిమానం ఉన్నా ఆయన బయోపిక్‌కు తాను దర్శకత్వం వహించనని డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అన్నారు. కోహ్లీ అంటే అందరికీ ఇష్టమని, ఆయనొక అద్భుతమని కొనియాడారు. ఒకవేళ ఎవరిదైనా బయోపిక్ చేయాల్సి వస్తే కష్టమైన సబ్జెక్ట్‌నే ఎంచుకుంటానని తెలిపారు. సాధారణ వ్యక్తి జీవితాన్ని తెరపై చూపిస్తానని పేర్కొన్నారు. కాగా అనురాగ్ తెరకెక్కించిన ‘నిషాంచి’ మూవీ ఈ నెల 19న రిలీజ్ కానుంది.
News September 16, 2025
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభం

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ప్రారంభమయ్యాయి. మన దేశంపై ట్రంప్ 50శాతం టారిఫ్‌లు విధించిన తర్వాత తొలిసారి ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఇరుదేశాల మధ్య ఐదు విడతల్లో సమావేశాలు జరిగాయి. ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధి బ్రెండన్ లించ్ ఇప్పటికే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
News September 16, 2025
శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం: భూమన

AP: శ్రీవారి పాదాల చెంత ఘోర అపచారం జరిగిందని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి వాపోయారు. ‘అలిపిరిలో మలమూత్రాలు విసర్జించే చోట, మద్యం బాటిల్స్ మధ్య శ్రీ మహావిష్ణువు విగ్రహం పడి ఉంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, హైందవ ధర్మానికి తూట్లు పొడిచేలా టీటీడీ తీరు ఉంది. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత వరుసగా ఘోర అపచారాలు జరుగుతున్నాయి. హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాల్సిన సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు.