News July 22, 2024

ఇదే కంటిన్యూ చేస్తే లాభం తక్కువే

image

చైనా నుంచి దిగుమతి చేసుకొని కొంత విలువ చేర్చి అమెరికాకు ఎగుమతి చేయడం వల్ల ప్రయోజనం తక్కువేనని ఆర్థిక సర్వే తెలిపింది. బదులుగా బీజింగ్ నుంచి FDIని ఎంచుకొని భారత్‌లోనే ఉత్పత్తి చేసి ఎగుమతి చేయడం మేలని సూచించింది. దీంతో వాణిజ్య లోటూ తగ్గుతుందని వెల్లడించింది. కరోనా టైమ్‌లో యూఎస్ కంపెనీలు డ్రాగన్ కంట్రీ నుంచి తరలివెళ్లడంతో మెక్సికో, వియత్నాం, తైవాన్, కొరియా FDI విధానంతోనే లబ్ధి పొందాయని గుర్తుచేసింది.

Similar News

News January 25, 2025

నాలుగు పథకాలపై నేడు సీఎం సమీక్ష

image

TG: ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతో మాట్లాడనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కొన్నిచోట్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులపై చర్చించనున్నారు. అటు, రాష్ట్ర వ్యాప్తంగా 16,348 గ్రామ, వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

News January 25, 2025

ప్రేక్షకుల అభిప్రాయమే నాకు ముఖ్యం: అనిల్ రావిపూడి

image

వరుస విజయాలు కట్టబెడుతూ ప్రేక్షకులు చాలా ఇచ్చారని, ప్రతిఫలంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే తన లక్ష్యమని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఆడియన్స్ ఖర్చు పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేస్తానన్నారు. థియేటర్లకు వచ్చే జనం, కలెక్షన్లనే సక్సెస్‌గా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారని, వారి మాటలతో ఒత్తిడికి లోనవ్వనని తెలిపారు. తనకు ప్రేక్షకుల అభిప్రాయమే ముఖ్యమని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.

News January 25, 2025

దక్షిణ జార్జియాను ఢీకొట్టనున్న భారీ ఐస్‌బర్గ్‌!

image

అంటార్కిటికా నుంచి విడిపోయిన ఓ భారీ మంచుకొండ(A23a) బ్రిటిష్ భూభాగం వైపు దూసుకెళ్తోంది. ఇది మున్ముందు దక్షిణ జార్జియా ద్వీపాన్ని ఢీకొనే అవకాశముంది. ఆ ప్రాంతానికి 280KM దూరంలో ఉన్న ఈ ఐస్‌బర్గ్ బలమైన గాలులు, సముద్ర ప్రవాహాల వల్ల వేగంగా కదులుతోంది. 4K చ.కి.మీ. వైశాల్యం ఉండే మంచుకొండ ఆ ద్వీపాన్ని ఢీకొట్టి అక్కడే చిక్కుకునే ప్రమాదముంది. దీంతో అందులోని పెంగ్విన్లు, సీల్స్‌కు ఆహారం దొరకడం కష్టమవుతుంది.