News July 22, 2024

రేపు అసెంబ్లీకి కేసీఆర్?

image

TG: రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ కానున్నారు. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో తొలి సారిగా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.

Similar News

News January 13, 2026

కోడి పందెం బరులు.. బౌన్సర్లు సిద్ధం!

image

AP: సంక్రాంతి కోడి పందేలకు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బరులు సిద్ధమయ్యాయి. షామియానాలు, సెక్యూరిటీ, బౌన్సర్లు, జనరేటర్లు, పార్కింగ్ స్థలాలు, తదితరాలకు నిర్వాహకులు రూ.కోట్లలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు అతిథుల కోసం బుక్ చేస్తున్న రూముల కోసం 3 రోజులకు గానూ రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తున్నారు. ముఖ్యంగా భీమవరం ఏరియాలో రూముల కోసం భారీగా డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.

News January 13, 2026

భోగి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి?

image

భోగి 13న, 14న అనే సందిగ్ధత నెలకొంది. అయితే హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది భోగి పండుగను జనవరి 14వ తేదీన జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజే భోగిగా భావిస్తారు. అదే రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేయడం శుభంగా చెబుతున్నారు. దీంతోనే సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. తర్వాతి రోజు సంక్రాంతి కాగా జనవరి 16న కనుమ పండుగ ఉంటుంది.

News January 13, 2026

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో పోస్టులు

image

CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (<>NIO<<>>) 14 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా (సివిల్, EE, CE/IT), డిగ్రీ(సైన్స్/ఏదైనా) అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జనవరి 22న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. డిప్లొమా విద్యార్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు కాగా, డిగ్రీ విద్యార్థులకు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. వెబ్‌సైట్: https://www.nio.res.in