News July 22, 2024
ప్రతి ఇద్దరు గ్రాడ్యుయేట్లలో ఒకరు ఉద్యోగానికి సెట్టవ్వరు!
యువతలో ఉద్యోగ నైపుణ్యాలు కొరవడుతున్నాయని ఆర్థిక సర్వే తేల్చిచెప్పింది. ప్రతి ఇద్దరు గ్రాడ్యుయేట్లలో ఒకరికే ఆధునిక ఆర్థిక వ్యవస్థకు తగిన ప్రతిభ ఉంటోందని పేర్కొంది. అయితే ఒకప్పటితో పోలిస్తే పరిస్థితి కొంత మెరుగైంది. గత దశాబ్దంలో 66% మందికి తగిన స్కిల్స్ ఉండేవి కావు. ఇప్పుడది 49 శాతానికి పడిపోవడం గమనార్హం. ఏఐ వంటి టెక్నాలజీలు సవాళ్లు విసురుతున్న తరుణంలో యువత నైపుణ్యాలు అందిపుచ్చుకోవడం అత్యావశ్యకం.
Similar News
News January 25, 2025
కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం: శార్దూల్
జమ్మూకశ్మీర్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో ముంబై ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం అతను మాట్లాడుతూ ‘సాధారణ పరిస్థితుల్లో ఎవరైనా రాణిస్తారు. ప్రతికూల సమయాల్లో ఎలా ఆడామనేదే ముఖ్యం. నాకు కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఇష్టం. అలాంటి వాటిని సవాలుగా తీసుకొని ఎలా అధిగమించాలో ఆలోచిస్తా’ అని అన్నారు. శార్దూల్ రాణించడంతో ముంబై జట్టు పటిష్ఠ స్థితిలో నిలిచింది.
News January 25, 2025
నాలుగు పథకాలపై నేడు సీఎం సమీక్ష
TG: ప్రభుత్వం ఈ నెల 26 నుంచి అమలు చేయనున్న నాలుగు పథకాలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు సమీక్ష నిర్వహించనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై అధికారులతో మాట్లాడనున్నారు. లబ్ధిదారుల ఎంపికలో కొన్నిచోట్ల నెలకొన్న గందరగోళ పరిస్థితులపై చర్చించనున్నారు. అటు, రాష్ట్ర వ్యాప్తంగా 16,348 గ్రామ, వార్డు సభలు పూర్తయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.
News January 25, 2025
ప్రేక్షకుల అభిప్రాయమే నాకు ముఖ్యం: అనిల్ రావిపూడి
వరుస విజయాలు కట్టబెడుతూ ప్రేక్షకులు చాలా ఇచ్చారని, ప్రతిఫలంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడమే తన లక్ష్యమని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఆడియన్స్ ఖర్చు పెట్టే ప్రతిపైసాకు న్యాయం చేస్తానన్నారు. థియేటర్లకు వచ్చే జనం, కలెక్షన్లనే సక్సెస్‌గా మాట్లాడుకుంటున్నామని చెప్పారు. క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారని, వారి మాటలతో ఒత్తిడికి లోనవ్వనని తెలిపారు. తనకు ప్రేక్షకుల అభిప్రాయమే ముఖ్యమని ఓ ఇంటర్వ్యూలో వివరించారు.