News July 22, 2024

HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

image

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 108 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిర్మాణ శాఖ 78, ఎస్సీ డెవలప్‌మెంట్ 4, ఉపాధి కల్పన 3, దివ్యాంగుల సంక్షేమ శాఖ 4, సీపీవో 4 మిగతావి ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు.

Similar News

News September 8, 2025

HYD: 3 లక్షల 3 వేల విగ్రహాల నిమజ్జనం

image

గణేష్ నిమజ్జనం విజయవంతంగా జరిగిందని GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆదివారం సాయంత్రం వరకు గ్రేటర్ వ్యాప్తంగా 3 లక్షల 3 వేల విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు వెల్లడించారు. పకడ్బందీ ప్రణాళిక, పటిష్టమైన ఏర్పాట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు GHMC, పోలీసు, విద్యుత్, హెచ్ఎండీఏ, హైడ్రా, రెవెన్యూ, విద్యుత్, పారిశుద్ధ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు.

News September 7, 2025

రంగారెడ్డి: నిరుద్యోగులకు శుభవార్త

image

నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి మ. 2.30 గంటల వరకు రంగారెడ్డి జిల్లా ఉపాధి కార్యాలయం నందు ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాధికారి జయశ్రీ తెలిపారు. విద్యార్హత 10th, ఇంటర్, డిగ్రీ, PG, ITI డిప్లమా. వయస్సు: 18-30 మధ్య ఉండాలి. మరిన్ని వివరాలకు 9063099306, 8977175394 నంబర్లను సంప్రదించాలన్నారు.

News September 7, 2025

ఎల్బీనగర్: మానవత్వం చాటుకున్న సీపీ

image

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మానవత్వం చాటుకున్నారు. బాలాపూర్ గణేశ్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సీపీ పర్యవేక్షిస్తున్నారు. అయితే మార్గమధ్యలో ప్రమాదానికి గురైన ఓ జంటను గమనించి, తన వాహనాన్ని నిలిపివేశారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స చేయించి, సురక్షితంగా పంపించారు. నిమజ్జనంలో బిజీగా ఉన్నప్పటికీ సీపీ తీసుకున్న ఈ ప్రత్యేక చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.