News July 22, 2024

అప్పుడూ డీజీపీని హెలికాప్టర్‌లో పంపి ఉంటే బాగుండేది: YCP

image

AP: మదనపల్లె సబ్‌కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాద ఘటనతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని YCP మండిపడింది. ‘హత్యలు, అత్యాచార ఘటనల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే ఇది. కలెక్టర్, CCL ఆఫీసుల్లో, ఆన్‌లైన్‌లోనూ ఆ రికార్డులుంటాయి. YCP నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారం, రషీద్ హత్య జరిగినప్పుడు DGPని ఇలాగే హెలికాప్టర్‌లో పంపి ఉంటే బాగుండేది’ అని ట్వీట్ చేసింది.

Similar News

News January 9, 2026

విమానాల తయారీలోకి అదానీ గ్రూప్

image

అదానీ గ్రూప్ విమానాల తయారీ రంగంలోకి అడుగు పెట్టనుంది. బ్రెజిల్‌కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రీజనల్ ప్యాసింజర్ జెట్ విమానాల తయారీకి అవసరమైన ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL) ఏర్పాటు చేయనున్నారు. ఫిక్స్‌డ్‌ వింగ్‌ ప్యాసింజర్‌ విమానాల తయారీకి సంబంధించి దేశంలో ఇదే తొలి అసెంబ్లింగ్‌ యూనిట్‌ కానుంది. ఈ నెలాఖరున జరిగే ఏవియేషన్ షోలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.

News January 9, 2026

PMV 480(అల్లూరి).. అధిక పోషకాల వరిగ రకం

image

‘వరిగ’ ఒక రకమైన చిరుధాన్యం. వీటిలో ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని అన్నం, అట్లు, మురుకుల తయారీలో ఉపయోగిస్తారు. విజయనగరం వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PMV 480(అల్లూరి) రకం వరిగ వంగడాన్ని తాజాగా విడుదల చేశారు. దీని పంటకాలం 72-77 రోజులు. ఇది ఖరీఫ్‌కు అనుకూలం. హెక్టారుకు 2.27 టన్నుల దిగుబడి వస్తుంది. మిగిలిన వాటి కంటే ఈ రకంలో ప్రొటీన్ శాతం అధికం.

News January 9, 2026

IIT ఇండోర్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>IIT <<>>ఇండోర్‌లో 38 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో PhDతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2కు నెలకు రూ.1,37,578, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1కు రూ.1,92,046, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.2,59,864 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iiti.ac.in/