News July 22, 2024

HYD: ప్రజావాణికి 108 దరఖాస్తులు

image

హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా 108 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ వెంకటాచారి తెలిపారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. నిర్మాణ శాఖ 78, ఎస్సీ డెవలప్‌మెంట్ 4, ఉపాధి కల్పన 3, దివ్యాంగుల సంక్షేమ శాఖ 4, సీపీవో 4 మిగతావి ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు వచ్చినట్లు ఆయన వివరించారు.

Similar News

News September 8, 2025

ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం.. ఇది గమనించారా?

image

సాధారణంగా ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం తర్వాత కొంతభాగం నీటిలో పైకి కన్పిస్తుంటుంది. అయితే ఈసారి బడా గణేశుడు పూర్తిగా నీటిలో నిమజ్జనమయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో శనివారం నిమజ్జనానికి వచ్చిన భక్తులు ఆ భారీ గణనాథుడు కన్పిస్తాడేమోనని క్రేన్ నం.4 వద్ద ఇలా బారులు తీరారు. అయితే అక్కడ మండపంలో గణపయ్యకు వేసిన భారీ పూలదండ ఆకారం కన్పించడంతో దానిని వారు ఆసక్తిగా తిలకించారు. మ.2లోపు గణనాథుడు నిమజ్జనమయ్యాడు.

News September 8, 2025

HYD: తెలంగాణ విమోచన దినోత్సవ కరపత్రాలు విడుదల

image

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడించారు. సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పాంప్లెట్, స్టికర్‌ను ఆయన విడుదల చేశారు. విమోచన దినోత్సవం తెలంగాణ ప్రజల త్యాగానికి, స్వాభిమానానికి శాశ్వత చిహ్నంగా పేర్కొన్నారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కోరారు.

News September 8, 2025

HYD: రోడ్డున పడేయలేదనా? రోడ్డుపై వదిలేశారు!

image

నగరవ్యాప్తంగా గణపయ్య ప్రతిమలను రోడ్లపైనే విక్రయించారు. ఆ విగ్రహాలను అమ్మి సొమ్ముచేసుకుని మిగిలిపోయినవి ఇలా ఎర్రగడ్డలో రోడ్లపైనే వదిలేశారు. లాభాలు ఇచ్చినందుకా ఇలా ఆయన బొమ్మలను రోడ్డుపై వదిలేశారని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సనత్‌నగర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. DCM వ్యాన్‌లో వాటిని తీసుకెళ్లి బేబీవాటర్ పాండ్‌, IDL చెరువులో నిమజ్జనం చేశారు. సతీశ్, సాయి ప్రకాశ్, రణ్‌వీర్, బవేశ్ కార్తీక్ ఉన్నారు.