News July 22, 2024
మిథున్ రెడ్డి ఆరోపణలకు పోలీసుల వివరణ

కొత్త ప్రభుత్వ వచ్చాక 31 మందిని హత్యచేశారని ఎంపీ మిథున్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ పోలీసులు స్పందించారు. ‘జూన్ 4 నుంచి జులై 22 వరకు రాజకీయ కారణాలతో 4 హత్యలు జరిగాయి. అనంతపురంలో 2, గుంటూరు, కర్నూలులో ఒక్కొక్కరు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు టీడీపీ, ఒకరు వైసీపీకి చెందినవారు. పాత కక్షలతో పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2హత్యలు జరిగాయి. మృతులు ఇద్దరూ YCPకి చెందిన వారు’ అని ఏపీ పోలీసులు ట్వీట్ చేశారు.
Similar News
News March 1, 2026
చిత్తూరు జిల్లాలో 93% పింఛన్ల పంపిణీ

జిల్లాలో శనివారం 93.10 శాతం మేర ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,33,419 మందికి గాను తొలి రోజున 2,17,324 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు అందజేశామన్నారు. మార్చి ఒకటిన ఆదివారం సెలవు కావడం తో, 2న సోమవారం మిగిలిన 16,095 మందికి పింఛన్లు అందించనున్నట్లు పీడీ పేర్కొన్నారు.
News March 1, 2026
చిత్తూరు: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు

జిల్లా వ్యాప్తంగా ఈనెల 2 నుంచి ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని డీఈవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలకు జిల్లాలో 13 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,528 మంది హాజరుకానున్నట్లు చెప్పారు. మార్చి 13 వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు.
News February 28, 2026
పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

గుడిపాల మండలంలో ఇప్పటి వరకు 89.76% శాతం మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను పంపిణీ చేసినట్లు ఎంపీడీవో శిరీష తెలిపారు. కలెక్టర్ సుమిత్ కుమార్ శనివారం 197. రామాపురంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 89.76% పెన్షన్లు పూర్తి చేశామన్నారు. మండలంలో 6,730 వేల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పారు. పెన్షన్ లబ్ధిదారులు, కూటమి నేతలు పాల్గొన్నారు.


