News July 22, 2024

ఆ నిబంధ‌న‌ల వ‌ల్లే రుణ‌మాఫీ కావ‌ట్లేదు: హ‌రీశ్‌రావు

image

పంట‌ల రుణ‌మాఫీకి రేష‌న్ కార్డు, PM కిసాన్ నిబంధ‌న అమ‌లు చేస్తున్నారు. ఈ నిబంధ‌న‌ల వ‌ల్ల చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కావ‌ట్లేదు అని MLA హ‌రీశ్‌రావు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. HYDలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రుణ‌మాఫీలో కోత‌లు పెట్టేందుకే రేష‌న్ కార్డు, PM కిసాన్ నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారని మండిప‌డ్డారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కం ఆగిపోయిందని, ల‌క్ష మందికి పైగా చెక్కుల కోసం ఎదురుచూస్తున్నారు.

Similar News

News September 8, 2025

మెదక్: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కరణం పరిణిత

image

బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో మెదక్ నియోజకవర్గ నేతకు చోటు లభించింది. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన మాజీ మంత్రి కరణం రామచంద్రరావు కోడలు కరణం పరిణిత సోమశేఖర్ రావు రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు. పరిణిత గతంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా పనిచేశారు.

News September 8, 2025

మెదక్: ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైంది: కలెక్టర్

image

మెదక్ జిల్లా కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కోసం 1052 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ అమూల్యమైనదని పేర్కొంటూ, ఓటరు జాబితాపై చర్చించారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటరు జాబితాలో ఖచ్చితంగా ఉండాలని తెలిపారు.

News September 8, 2025

మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కార్యాలయానికి తరలివచ్చి తమ సమస్యలు నేరుగా ఎస్పీ దృష్టికి తెచ్చారు. పరిష్కారం చేసే వాటిని పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి నేరుగా రావాలన్నారు.