News July 22, 2024
HYD: మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు సహకరించండి: సీఎం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్‌ని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, వారి కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News September 9, 2025
గ్రంథాలయాలను బలోపేతం చేయాలి: డా. రియాజ్

తెలంగాణలోని అన్ని స్థాయిల్లో గ్రంథాలయాలను బలోపేతం చేయాలని ప్రభుత్వానికి రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ డాక్టర్ రియాజ్ విజ్ఞప్తి చేశారు. “మరో గ్రంథాలయ ఉద్యమం, పుస్తకంతో నడక” అనే కార్యక్రమాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ వరకు నడక ర్యాలీని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వమే కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి గ్రంథాలయాలకు సరఫరా చేస్తే మరింత అభివృద్ధి చెందుతాయన్నారు.
News September 9, 2025
HYD: మరో రెండు రోజులు పారిద్ధ్య పనులు

నెక్లెస్ రోడ్డుతో పాటు పీపుల్స్‌ప్లాజా, బేబిపాండ్, ఎన్టీఆర్ మార్గ్, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనం కారణంగా చెత్త పేరుకుపోయింది. నెక్లెస్ రోడ్డులో 100 మంది స్వీపర్లు, ఎన్టీఆర్ మార్గ్‌లో 30 మంది స్వీపర్లు విధుల్లో పాల్గొంటున్నారు. చెత్త తొలగింపునకు మరో రెండు రోజుల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు విగ్రహాల ఐరన్ రాడ్స్‌ను తొలగిస్తున్నారు.
News September 9, 2025
రవీంద్రభారతిలో ఆకట్టుకున్న కవి సమ్మేళనం

ప్రజా కవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టుకుంది. భాషా, సాంస్కతిక శాఖ సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ధిక్కార స్వరం ప్రజా కవి కాళోజీ నారాయణరావు అని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి ఎన్.బాలాచారి పాల్గొన్నారు.