News July 22, 2024
గోదావరి వరదలపై మంత్రి సమీక్ష సమావేశం

గోదావరి వరదలపై సోమవారం భద్రాచలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ నష్టాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గోదావరి వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని పేర్కొన్నారు.
Similar News
News September 8, 2025
ప్రజావాణి అర్జీలు త్వరగా పరిష్కరించాలి: అదనపు కలెక్టర్

ప్రజావాణిలో ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేయకుండా, బాధితులకు న్యాయం చేయాలన్నారు.
News September 8, 2025
ఖమ్మం: గణేశ్ ఉత్సవాలపై సీపీ ప్రశంసపీ

గణేశ్ ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు శ్రమించిన పోలీసు, హోంగార్డు సిబ్బందిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. వినాయక నవరాత్రుల నుంచి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉత్సవాలు జరగడానికి సహకరించిన భక్తులకు, వివిధ శాఖల సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
News September 8, 2025
భద్రాచలం: 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2న జరిగే విజయదశమి వేడుకలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 23 నుంచి రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అక్టోబర్ 7న శబరి స్మృతియాత్ర నిర్వహిస్తామని ఆలయ ఈవో దామోదర్ రావు, వైదిక కమిటీ సభ్యులు తెలిపారు.