News July 22, 2024

నష్టం వివరాలను అందజేయాలి: కలెక్టర్

image

అల్పపీడనం ప్రభావంతో విశాఖ జిల్లాలో 4 రోజులుగా కురిసిన వర్షాలకు జరిగిన నష్టం వివరాలను అందజేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నష్టం నివేదికలను కలెక్టర్ కార్యాలయానికి సత్వరమే అందించాలని ఆదేశించారు. జేసీ మయూర్ అశోక్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News September 24, 2025

పేదల గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలి: విశాఖ కలెక్టర్

image

పేదల గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. బుధవారం గృహ నిర్మాణ ప్రగతిపై హౌసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 2026 నాటికి గృహ నిర్మాణ పనులు పూర్తి చేయవలసి ఉన్నందున సంబంధిత అధికారులందరూ పేదల గృహ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మార్చికి పూర్తి చేసుకోకపోతే ఇంటితో పాటు స్థలం పట్టా కూడా రద్దు చేస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు.

News September 24, 2025

విశాఖలో జోన్ల ఏర్పాటుపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

image

ఎమ్మెల్యే గణబాబు ప్రస్తావించిన జోనల్ కమిషనర్ల అధికారాల బదలాయింపుపై మంత్రి నారాయణ స్పందించారు. విశాఖలో జోన్ల ఏర్పాటు పూర్తయిందని, వాటికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు తక్షణమే జారీ చేస్తామన్నారు. సింహాచలం టీడీఆర్ బాండ్ల సమస్యపై దేవదాయ శాఖతో చర్చిస్తున్నామని, త్వరలోనే ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామని చెప్పారు.

News September 24, 2025

గాజువాక: డాక్‌యార్డ్ వంతెన రెఢీ

image

గాజువాక పారిశ్రామిక ప్రాంత వాసుల రవాణా కష్టాలు తీరనున్నాయి. డాక్‌యార్డ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. పోర్ట్ యాజమాన్యం మద్రాస్ ఐఐటి ఇంజనీర్ల బృందంతో రూ.26 కోట్లతో 330 మీ.పొడవు.10.5మీ.వెడల్పు 20 నెలల్లో వంతెన పునర్నిర్మాణం పూర్తిచేశారు. దసరా నుంచి రాకపోకలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలా అయితే ప్రయాణికులకు సమయంతోపాటు ఖర్చూ తగ్గుతుంది.