News July 22, 2024

జైనథ్: పెనుగంగా నదిలో యువకుడు గల్లంతు

image

జైనథ్ మండలం డొల్లార వద్ద పెనుగంగా నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సోమవారం గాలింపు చర్యలను చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం డీడీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. పెనుగంగా నది వద్ద విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన యువకుడు చాంద (టీ) కు చెందిన శివగా గుర్తించారు. గాలింపు చర్యలను ఎస్పీ గౌస్ ఆలం పరిశీలించారు. సీఐ సాయినాథ్ ఎస్సై పురుషోత్తం ఉన్నారు.

Similar News

News September 9, 2025

ADB: ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో పోస్ట్.. ఐదుగురిపై కేసు

image

ఆదిలాబాద్ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, మత సామరస్యాన్ని దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఐదుగురిపై కేసులు నమోదు చేసినట్లు టూటౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణానికి చెందిన గణేష్, గౌతం, ప్రశాంత్, మునీశ్వర్, మహేష్ ఎమ్మెల్యే పేరుతో వాట్సాప్‌లో మెసేజ్ పెట్టారన్నారు. వాటిని గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసిన పోస్టులు గొడవలకు దారి తీసేలా ఉండటంతో నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు.

News September 9, 2025

ఆదిలాబాద్: ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సమావేశం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాజర్షి షా క్యాంప్ కార్యాలయంలో సోమవారం పోలింగ్ కేంద్రాలు, ఓటర్ జాబితాపై సమావేశం నిర్వహించారు. వార్డుల వారీగా, గ్రామ పంచాయితీ ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ప్రచురణపై ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై చర్చించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించమన్నారు.

News September 9, 2025

ఆదిలాబాద్: విద్యుత్ సమస్యల పరిష్కారానికి క్యాంప్

image

ఆదిలాబాద్ టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని రూరల్ సెక్షన్, మావల, అదిలాబాద్ నార్త్, సౌత్ సెక్షన్, ఆదిలాబాద్ టౌన్-3 సెక్షన్‌ల పరిధిలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి దస్నపూర్ సబ్ స్టేషన్‌లో ఈ నెల 9న క్యాంప్ నిర్వహించనున్నట్లు టౌన్ సబ్ డివిజన్ అసిస్టెంట్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఏవైనా విద్యుత్తు సమస్యలు ఉంటే విన్నవించి పరిష్కరించుకోవలన్నారు.