News July 22, 2024
NZB: పసుపు లోడుతో పాటు లారీ దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్

పసుపులోడుతో పాటు లారీని దొంగిలించిన కేసులో నిందితుడైన నవీపేట్‌కు చెందిన షేక్ తోఫిక్ అలీ అలియాస్ షరీఫ్ (37) ను సోమవారం అరెస్టు చేసినట్లు నిజామాబాద్ వన్ టౌన్ SHO డి.విజయ్ బాబు తెలిపారు. నిందితుడి నుంచి రూ. 30 లక్షలపసుపును, రూ.40 లక్షల లారీని స్వాధీన పరుచుకుని మిగతా నేరస్థుల కోసం గాలిస్తున్నామని విజయ్ బాబు చెప్పారు.
Similar News
News September 9, 2025
NZB: బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియామకం

బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి నియమితులయ్యారు. ఈ అవకాశం కల్పించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వర్తించి పార్టీ ఎదుగుదలకు శాయశక్తులా కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
News September 9, 2025
నవీపేట్: జార్ఖండ్‌లో యువకుడి మృతి

నవీపేట్ మండలం అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి(20) జార్ఖండ్ రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లాలో పోస్టల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆదివారం మిత్రులతో కలిసి నదిలో స్నానానికి వెళ్లగా నదీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సోమవారం గాలింపు చర్యలు చేపట్టగా మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News September 9, 2025
ఆర్మూర్: చెరువులో దూకిన మహిళను కాపాడిన పోలీసులు

ఆర్మూర్ శివారులోని పెర్కిట్ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను పోలీసులు రక్షించారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పెర్కిట్‌కు చెందిన ఓ మహిళ(50) కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది చెరువులోకి దూకింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆమెను సురక్షితంగా బయటికి తీశారు.