News July 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} భద్రాచలం రెండో ప్రమాద హెచ్చరిక జారీ
∆} పెద్దవాగు ప్రాజెక్టును సందర్శించిన మంత్రి పొంగులేటి
∆} టేకులపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య చెక్కుల పంపిణీ
∆} పంచాయతీరాజ్ అధికారులతో సత్తుపల్లి ఎమ్మెల్యే భేటీ
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన వర్షాలు
∆} వరదలపై సమీక్ష నిర్వహించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్

Similar News

News September 10, 2025

ఖమ్మం: పారదర్శకంగా గ్రామ పరిపాలన అధికారుల కౌన్సిలింగ్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో గ్రామ పరిపాలన అధికారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ.. పైరవీలకు తావులేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే పోస్టింగ్‌లు ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 299 క్లస్టర్లలో 252 మందికి పోస్టింగ్‌లు కల్పిస్తున్నామని చెప్పారు.
భూ భారతి చట్టం అమలు, భూ సమస్యల పరిష్కారంలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.

News September 10, 2025

లేఅవుట్ అనుమతుల్లో నిబంధనలు పాటించాలి: కలెక్టర్

image

ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో బుధవారం జరిగిన లేఅవుట్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్ అనుమతులను నిబంధనల ప్రకారం మంజూరు చేయాలని స్పష్టం చేశారు. రోడ్లు, సీవరేజ్, వీధి దీపాలు, తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నీటి వనరుల సమీపంలో లేఅవుట్లకు అనుమతి ఇవ్వరాదని, అధికారులు పారదర్శకతతో పాటు పర్యవేక్షణపై దృష్టి సారించాలన్నారు.

News September 10, 2025

ఝార్ఖండ్ సీఎంను కలిసిన డిప్యూటీ సీఎం భట్టి

image

ఝార్ఖండ్ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇరువురూ విస్తృతంగా చర్చించారు. భేటీలో తమ అనుభవాలను పంచుకోవడం, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య భాగస్వామ్యాన్ని ఎలా పెంపొందించాలనే అంశాలపై చర్చించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు.