News July 22, 2024
HYD: రాచకొండలో జరిగే నేరాలను అరికట్టాలి..

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, అదనపు డీసీపీలు, ఎసీపీలు, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులతో కమిషనర్ సుధీర్ బాబు నేరేడ్‌మెట్‌లోని కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ పరిధిలో జరిగే నేరాలను అరికట్టాలని, నేరస్థులను పట్టుకోవడానికి నేరపరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సీసీ కెమెరాలను ఉపయోగించుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News September 10, 2025
HYD: పోటెత్తిన వరద.. జంట జలాశయాల గేట్ల ఎత్తివేత

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో బుధవారం గేట్లు తెరిచారు. హిమాయత్‌సాగర్ ఒక గేటు ఎత్తి 671 క్యూసెక్కుల నీటిని కిందికి వదలారు. ఉస్మాన్‌సాగర్ రెండు గేట్లు ఎత్తి 234 క్యూసెక్కులు విడుదల చేశారు. హిమాయత్‌సాగర్ నీటి మట్టం 1763.50 అడుగులు కాగా ప్రస్తుతం 1762.55 అడుగులు, గండిపేట పూర్తి స్థాయి మట్టం 1,790 అడుగులు కాగా ప్రస్తుతం 1,789.15 అడుగుల నీరుంది.
News September 10, 2025
BREAKING: కూకట్‌పల్లిలో మహిళ హత్య

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2025
పాక్ జాతీయుడిని స్వదేశానికి పంపిన హైదరాబాద్ పోలీసులు

చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని హైదరాబాద్ పోలీసులు స్వదేశానికి పంపించారు. మహ్మద్ ఉస్మాన్(48) అనే వ్యక్తి నేపాల్ మీదుగా 2011లో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాడు. హైదరాబాద్‌లో నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇతడు నిందితుడు. శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఇతడిని సెప్టెంబర్ 9న అటారీ సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్స్‌కు అప్పగించారు.