News July 22, 2024
గుంటూరు: TODAY TOP NEWS

*వైసీపీకి మాజీ MLA రాజీనామా
*అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ ఎంట్రీ
*అసెంబ్లీ వద్ద జగన్ ఆగ్రహం
*అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన జగన్
*నరసరావుపేట: 16 బైకులు స్వాధీనం
*వినుకొండ హత్యపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
*జగన్‌పై మరోసారి ఫైరైన MLA జీవీ
*నగరం: రూ.60 లక్షలు మాయం
*అమెరికాలో తెనాలి వైద్యురాలి మృతి
*అసెంబ్లీకి పసుపు చొక్కాతో మంత్రి లోకేశ్
Similar News
News January 30, 2026
GNT: బాల్య వివాహ విముక్తి రథాన్ని ప్రారంభించిన కలెక్టర్

బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గురువారం ప్రారంభించారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలో క్రాఫ్ రూపొందించిన బాల్య వివాహ విముక్తి రథాన్ని కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా ప్రచారం కల్పించడంలో ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు.
News January 29, 2026
గుంటూరు GGHలో రూ.132 కోట్లతో సరికొత్త భవనం

జీజీహెచ్‌లో మాతా–శిశు సంరక్షణ ఏళ్ల తరబడి సదుపాయాల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ పరిస్థితిని గమనించిన కానూరి జింకానా సభ్యులు ముందుకొచ్చి రూ.100 కోట్లతో సెల్లార్, జీ+5 అంతస్తుల్లో 597 పడకలతో ఆధునాతన భవనం నిర్మించారు. డా. గవిని ఉమాదేవి రూ.22 కోట్లు విరాళంగా అందించగా, ప్రభుత్వం రూ.27 కోట్ల పరికరాలు సమకూర్చింది. మొత్తం రూ.132 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని రేపు సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
News January 29, 2026
GNT: ఏఆర్ పోలీసులకు వార్షిక శిక్షణ

గుంటూరు జిల్లా సాయుధ దళ (AR) సిబ్బందికి వార్షిక మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. పోలీసుల్లో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆయుధ వినియోగంలో నైపుణ్యాన్ని పెంపొందించడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ జిందాల్ పేర్కొన్నారు. రెండు వారాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో వీవీఐపీ భద్రత, బందోబస్తు నిర్వహణ ప్రజలతో నడుచుకోవాల్సిన తీరుపై ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నారు.


