News July 23, 2024
కిడ్నాప్ వార్త ఫేక్: పోలీసులు
TG: హైదరాబాద్‌లో అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ ట్రాప్ చేస్తోందన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. రెండ్రోజుల క్రితం తార్నాక మెట్రోస్టేషన్ వద్ద ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేయగా పోలీసులు రక్షించారనే వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అయితే ఇదంతా అవాస్తవమని పోలీసులు తెలిపారు. విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటన ఏదీ జరగలేదని చెప్పారు. ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News November 23, 2024
ఆధిక్యంలో నటి భర్త
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో నటి, సింగర్ స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. అనుశక్తి నగర్ సెగ్మెంట్‌లో ఆయన సమీప ప్రత్యర్థి సనా మాలిక్(NCP)పై లీడింగ్‌లో కొనసాగుతున్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిలోని ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి ఫహద్ పోటీ చేస్తున్నారు.
News November 23, 2024
ప్రియాంక @ 54,000+ మెజార్టీ..
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆమె 54 వేలకు పైగా మెజార్టీ సాధించారు. సీపీఎం, బీజేపీ అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాంధీ కుటుంబీకురాలికి 5 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు.
News November 23, 2024
మహారాష్ట్ర లీడింగ్స్: మ్యాజిక్ ఫిగర్ దాటేసిన మహాయుతి
మహారాష్ట్ర ఓట్ల లెక్కింపులో NDA కూటమి దూకుడు ప్రదర్శిస్తోంది. విపక్ష MVAను వెనక్కి నెట్టేసింది. మ్యాజిక్ ఫిగర్ 145ను దాటేసింది. ప్రస్తుతం 149 స్థానాల్లో జోరు చూపిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూటమీ 97 స్థానాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇతరులు 5 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇంకా లెక్కింపు జరుగుతుండటంతో ఆధిక్యాలు మారే అవకాశం ఉంది.