News July 23, 2024

ప్రజావాణి కార్యక్రమానికి 80 దరఖాస్తులు: కలెక్టర్

image

ప్రజావాణి కార్యక్రమనికి మొత్తం 80 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్ లతతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో భూ సమస్యలపై 38 దరఖాస్తులు, డిఆర్డిఓ 12, డియంహెచ్ఓ 8, ఇతర శాఖలకు సంబంధించి 22, మొత్తం 80 దరఖాస్తులు అందాయని తెలిపారు.

Similar News

News November 11, 2025

నల్గొండ: 4 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని 1,781 గ్రామ పంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. అభివృద్ధి సంగతి అటు ఉంచితే.. కనీసం జీతాలు, జీపీల మెయింటెనెన్స్ లాంటి పనులకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతుందని గ్రామస్థులు తెలిపారు.

News November 11, 2025

NLG: 50% సిలబస్ ఇంకా అలానే..!

image

ఇంటర్ సిలబస్ పూర్తికాక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 140 ఉన్నాయి. వాటిలో 12,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొన్ని కాలేజీల్లో 50% సిలబస్ కూడా పూర్తి కాలేదని తెలుస్తుంది. ఐదు నెలల్లో కేవలం 50 శాతం మాత్రమే సిలబస్ పూర్తి అయింది.

News November 11, 2025

NLG: పంట పండింది.. సేకరణ ఇలా

image

NLG జిల్లాలో ధాన్యం సేకరణ సాఫీగా కొనసాగుతోంది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో రైతులు 5,26,796 ఎకరాల్లో వరి సాగు చేయగా.. 2,56,665 ఎకరాల్లో సాధారణ, 2,70,131ఎకరాల్లో సన్నరకం సాగు చేశారు. తద్వారా 13,44,268 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా. మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం 4,73,036 టన్నులు పోగా.. అమ్మకానికి 6,30,981 మెట్రిక్ టన్నుల కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ లెక్కలు వేస్తోంది.