News July 23, 2024
INS బ్రహ్మపుత్రలో అగ్నిప్రమాదం.. సెయిలర్ గల్లంతు

ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో INS బ్రహ్మపుత్ర యుద్ధనౌకలో అగ్నిప్రమాదం జరిగింది. మెయింటెన్స్‌లో ఉన్న నౌకలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగగా నిన్న ఉదయానికి అదుపు చేసినట్లు నేవీ వెల్లడించింది. ఈ ఘటనలో నౌక స్వల్పంగా ధ్వంసమై పక్కకు ఒరిగింది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది సురక్షితంగా బయటపడినా ఓ జూనియర్ సెయిలర్ ఆచూకీ గల్లంతైంది. సెయిలర్ ఆచూకీ, ప్రమాదానికి గల కారణాలపైన అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
Similar News
News November 5, 2025
APPLY NOW : PGIMERలో ఉద్యోగాలు

చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(<
News November 5, 2025
చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.
News November 5, 2025
నేడు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు

ఇవాళ గురుపూర్ణిమతో పాటు గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో విద్యాసంస్థలు, బ్యాంకులు, ఆఫీసులు మూసి ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. అటు ఏపీలో ఆప్షనల్ హాలిడే మాత్రమే ఉంది కాబట్టి స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు తెరిచి ఉండనున్నాయి. ఉద్యోగులు ఎవరైనా కావాలనుకుంటే సెలవు తీసుకోవచ్చు.


