News July 23, 2024

ఏపీకి ₹35,492 కోట్లు ఇచ్చాం: కేంద్రం

image

AP: రాష్ట్రానికి ఇప్పటివరకు ₹35,492 కోట్ల ఆర్థికసాయం అందించినట్లు కేంద్రం వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు కోసం ₹15,147కోట్లు, అమరావతికి ₹2500 కోట్లు, రాయలసీమకు ₹1,750 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. గత ఐదేళ్లలో వివిధ పథకాల ద్వారా ఏపీ ₹63వేల కోట్లు లబ్ధి పొందిందని వెల్లడించింది. గరిష్ఠంగా FY23లో రాష్ట్రానికి కేంద్ర పథకాల ద్వారా ₹16,114 కోట్ల లబ్ధి చేకూరిందని నిన్న పార్లమెంటులో వివరించింది.

Similar News

News January 26, 2025

మువ్వన్నెల వెలుగుల్లో సెక్రటేరియట్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగుల లైట్లతో అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ భవనం మువ్వన్నెల విద్యుద్దీపాలతో కాంతులీనింది. నిన్న రాత్రి తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News January 26, 2025

మన తొలి ‘రిపబ్లిక్ డే’కు అతిథి ఎవరంటే..

image

ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మన తొలి రిపబ్లిక్ డేకు కూడా ఇండోనేషియా అధ్యక్షుడే చీఫ్ గెస్ట్ కావడం విశేషం. 1950లో ఇర్విన్ యాంఫీ థియేటర్లో నిర్వహించిన వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆ దేశానికి స్వాతంత్ర్యం దక్కడంలో భారత్ అండగా నిలిచింది.

News January 26, 2025

సింగర్‌తో సిరాజ్.. ఫొటోతో డేటింగ్ రూమర్స్

image

టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో సింగర్ జనై భోస్లే దిగిన ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జనై ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తన బర్త్‌డే సెలబ్రేషన్ ఫొటోల్లో హైదరాబాదీతో క్యాండిడ్ ఉంది. దీంతో ఫాస్ట్ బౌలర్‌తో ఆశా భోస్లే మనవరాలు డేటింగ్‌లో ఉందనే కామెంట్లు గుప్పుమన్నాయి. దీనిపై ఇప్పటివరకు ఎవరి వైపు నుంచి ఏ స్టేట్‌మెంట్ రాలేదు.