News July 23, 2024

5 రోజుల్లో 200 టీఎంసీలు సముద్రం పాలు!

image

ఈ నెల 17 నుంచి 22 సాయంత్రం వరకు 5 రోజుల్లో 200 టీఎంసీల గోదావరి నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని రోజులుగా ప్రాణహిత, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి నదులకు వరద పోటెత్తుతోంది. ఈ నీటిని ఒడిసిపట్టే పరిస్థితి లేకపోవడంతో ఆ వరద అంతా సముద్రం పాలవుతోంది. మరోవైపు ప్రధాన గోదావరిపై ఉన్న శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్ప వరద ప్రవాహం వస్తోంది.

Similar News

News January 3, 2026

సిక్ లీవ్ అడిగితే లైవ్ లొకేషన్ షేర్ చేయమన్న మేనేజర్

image

తీవ్రమైన తలనొప్పితో సిక్ లీవ్ అడిగిన ఒక ఉద్యోగికి తన మేనేజర్ నుంచి వింత అనుభవం ఎదురైంది. లీవ్ కావాలంటే వాట్సాప్‌లో ‘లైవ్ లొకేషన్’ షేర్ చేయాలని మేనేజర్ పట్టుబట్టారు. దీంతో షాకైన సదరు ఉద్యోగి ఈ విషయాన్ని Reddit వేదికగా వాట్సాప్ స్క్రీన్‌షాట్లతో సహా పంచుకున్నారు. ఇది వ్యక్తిగత ప్రైవసీని ఉల్లంఘించడమేనంటూ నెటిజన్లు మేనేజర్ తీరును, అక్కడి వర్క్‌కల్చర్‌ను తప్పుబడుతున్నారు.

News January 3, 2026

AIతో రాష్ట్రపతి, ప్రధాని ఫేక్ వీడియోలు.. వ్యక్తి అరెస్ట్!

image

ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సంబంధించిన AI ఫేక్ వీడియోలు క్రియేట్ చేసినందుకు బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ప్రమోద్ కుమార్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి పేర్లు, గొంతును వాడుతూ సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నాడని కేసు నమోదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే ఇతని లక్ష్యమని పోలీసులు తెలిపారు.

News January 3, 2026

MDLలో 200 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌(MDL)లో 200 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 5)ఆఖరు తేదీ. BE/బీటెక్, డిప్లొమా, డిగ్రీ(B.COM, BCA, BBA, BSW) ఉత్తీర్ణులు అర్హులు. 18 నుంచి 27ఏళ్లు కలిగి ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అర్హతగల అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:mazagondock.in/