News July 23, 2024
హమ్మయ్యా.. భారీ వర్షాల్లేవు!
తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. ఏపీ, తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు లేవని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. నేడు ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, తూ.గో., ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అటు తెలంగాణలోనూ రాబోయే 6 రోజుల పాటు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.
Similar News
News January 26, 2025
సైఫ్ అలీఖాన్‌పై దాడి.. మరో ట్విస్ట్!
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసు మరో మలుపు తీసుకుంది. ఈ నెల 15న సైఫ్ ఇంట్లోకి చొరబడిన నిందితుడు ఆయనపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం సైఫ్ నివాసంలో 19 సెట్ల వేలిముద్రల్ని క్లూస్ టీమ్ సేకరించగా, వాటిలో ఒక్కటి కూడా నిందితుడు షరీఫుల్ ఇస్లామ్ వేలిముద్రలతో సరిపోలేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ముంబై పోలీసులు మరోమారు ఘటనాస్థలాన్ని, సాక్ష్యాధారాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
News January 26, 2025
ఒత్తిడి వల్లే పరుగులు చేయలేకపోతున్నా: గిల్
రెడ్ బాల్ క్రికెట్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలని తనపై తాను ఒత్తిడి పెట్టుకుంటున్నట్లు శుభ్‌మన్ గిల్ తెలిపారు. దాని వల్లే కొన్నిసార్లు ఏకాగ్రతను కోల్పోయి ఔట్ అవుతున్నట్లు చెప్పారు. కర్ణాటకVSపంజాబ్ రంజీ మ్యాచులో సెంచరీ చేసిన గిల్, ఇటీవల జరిగిన BGTలో విఫలమైన సంగతి తెలిసిందే. 6 ఇన్నింగ్స్‌లలో 18.60 సగటుతో కేవలం 93 పరుగులు చేశారు. దీంతో అతడిపై విమర్శలొచ్చాయి.
News January 26, 2025
వర్సిటీల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి: సీఎం
TG: రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు పదేళ్లు పాలించే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు CM రేవంత్ తెలిపారు. డా.అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో మాట్లాడుతూ వర్సిటీల పునర్నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. VCలుగా అన్ని సామాజిక వర్గాల వారు ఉండాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వర్సిటీల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని వీసీలను ఆదేశించారు. UGC ద్వారా వీసీల నియామకాలు చేపట్టాలని కేంద్రం కుట్ర చేస్తోందన్నారు.