News July 23, 2024

కేంద్ర బడ్జెట్‌పై భారీ ఆశలు

image

ఎన్డీయే సర్కారులో కీలకంగా ఉన్న టీడీపీ కేంద్ర బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా రాజధాని అమరావతికి నిధులు, పోలవరం, రైల్వే ప్రాజెక్టులు, విజయవాడ-అనంతపురం ఎక్స్‌ప్రెస్ వే, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయిస్తుందని భావిస్తోంది. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలకు నివేదికలు సమర్పించారు. మరి ఏపీకి కేంద్రం ఏమిస్తుందో కాసేపట్లో తేలనుంది.

Similar News

News January 27, 2025

ట్రంప్ కొరడా: కాళ్ల బేరానికొచ్చిన కొలంబియా Prez

image

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ కొరడాకు కొలంబియా ప్రెసిడెంట్ గుస్తావో పెట్రో దిగొచ్చారు. ఆంక్షలు అమలు చేసిన కొన్ని గంటల్లోనే కాళ్లబేరానికి వచ్చారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న తమ దేశస్థులను తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానం పంపించారు. వారిని క్రిమినల్స్‌గా చూడొద్దని, గౌరవంగా పంపాలని కోరారు. అమెరికాతో నిరంతరం టచ్‌లో ఉంటామన్నారు. అంతకు ముందు <<15276291>>US<<>> విమానాల ల్యాండింగ్‌కు ఆయన అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.

News January 27, 2025

GBSతో మహారాష్ట్రలో తొలి మరణం

image

గిలియన్-బార్ సిండ్రోమ్(GBS)తో భారత్‌లో తొలి మరణం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఈ అనారోగ్యంతో ఒకరు మృతి చెందినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రోగుల సంఖ్య 101కి చేరిందని, వారిలో 16మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని పేర్కొంది. జీబీఎస్ అనేది అరుదైన నరాల సంబంధిత అనారోగ్యం. ఇది తలెత్తిన వారిలో సొంత రోగ నిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది.

News January 27, 2025

ఆ సినిమా చూసే.. భార్యను ముక్కలుగా నరికాడు

image

మలయాళ క్రైమ్, థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ సినిమా స్ఫూర్తితోనే తన భార్య మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దత్తత తీసుకున్న కూతురిని తల్లి, కుమారుడు కలిసి హత్య చేస్తారు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు శరీర భాగాలను ఓ ట్యాంకులో వేసి కెమికల్స్ పోసి కరిగిస్తారు. ఆ నీళ్లను వాష్ రూమ్ ఫ్లష్ ద్వారా వదులుతారు. ఆ మూవీలో చేసినట్లే గురుమూర్తి కూడా మాయం చేశాడు.