News July 23, 2024

ఎలా నిద్రపడుతోందిరా? సూర్యను తిట్టిన రఘువరన్!

image

హీరో సూర్య ఓ సూపర్ స్టార్. కానీ ఒకప్పుడు ఆయన్ను ‘నటన రాని వ్యక్తి. తండ్రి పేరు మీద ఇండస్ట్రీకి వచ్చినవాడు’ అంటూ విమర్శించేవారు. ఓరోజు సూర్య, దివంగత నటుడు రఘువరన్ కలిసి రైల్లో ప్రయాణం చేస్తున్నారట. నిద్రపోతున్న సూర్యను రఘు లేపి ‘ఎలా నిద్రపడుతోందిరా నీకు? ఇంకెంత కాలం మీ నాన్న పేరు చెప్పుకొని బతుకుతావ్?’ అని తిట్టారట. దీంతో పట్టుదలగా తనను తాను సూపర్‌స్టార్‌గా మలచుకున్నారు సూర్య. ఈరోజు ఆయన బర్త్ డే.

Similar News

News September 19, 2025

మునగాకుతో జుట్టు సమస్యలకు చెక్

image

మునగాకులలో అమైనో ఆమ్లాలు, విటమిన్లు, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మునగాకు పొడిని హెయిర్ ప్యాక్‌గా వాడుకోవచ్చు. టేబుల్ స్పూన్ మునగాకు పొడికి కొంచెం పెరుగు కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని కుదుళ్లకు పట్టేలా వేసుకొని అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలలో చుండ్రు, దురద తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యవంతంగా, నిగనిగలాడుతుంది.

News September 19, 2025

TDPలో చేరనున్న ముగ్గురు YCP ఎమ్మెల్సీలు?

image

AP: వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు వీరు ముగ్గురు రాజీనామా చేశారు. కాగా వీరి రాజీనామాలపై మండలి ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

News September 19, 2025

పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 ఉద్యోగాలు

image

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పవన్ హాన్స్ లిమిటెడ్‌లో 13 పోస్టులకు ప్రకటన వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 12. పూర్తి వివరాల కోసం <>https://www.pawanhans.co.in/<<>> వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.