News July 23, 2024
బడ్జెట్‌ను ఎలా సీక్రెట్‌గా ఉంచుతారంటే?

1951 నుంచి 1980 వరకు ఢిల్లీలో ఉన్న మింటో రోడ్‌లోని ప్రెస్‌లో బడ్జెట్ ముద్రించేవారు. ఆ తర్వాత పార్లమెంటులోని నార్త్ బ్లాక్ కింది ఫ్లోర్‌లో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశారు. అందులోనే బడ్జెట్ ప్రతులు ప్రింట్ అవుతాయి. బడ్జెట్ ప్రకటనకు ముందు ఆర్థికశాఖ కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించరు. భారీ భద్రత ఉంటుంది. కేవలం బడ్జెట్ రూపకల్పనలో పాలుపంచుకునే వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు.
Similar News
News April 6, 2026
గ్యాస్ కొరతపై రాహుల్ ఫైర్

వంట గ్యాస్ కొరతపై రాహుల్ గాంధీ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కరోనా కష్టకాలాన్ని మోదీ ప్రభుత్వం ఎలాగైతే గాలికొదిలేసిందో ఇప్పుడు గ్యాస్ సంక్షోభాన్నీ అలాగే హ్యాండిల్ చేస్తోందన్నారు. ప్రకటనలకే పరిమితమవుతూ పేదలను ఇబ్బందుల్లోకి నెట్టారని ఆరోపించారు. రోజూ ₹500-800 సంపాదించే కూలీలకు గ్యాస్ అందనంత దూరమైందన్నారు. దీనివల్ల కార్మికులు నగరాలను వదిలి గ్రామాలకు వెళ్తున్నారని, పరిశ్రమలు నష్టపోతున్నాయన్నారు.
News April 6, 2026
ప్చ్.. ఇంకా IPL ఆడాల్సింది: అశ్విన్

IPLలో వరుసగా 3 మ్యాచుల్లో CSK ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ ప్లేయర్ అశ్విన్ నిరాశ వ్యక్తం చేశారు. గత సీజన్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది కాదని వాపోయారు. జట్టుపై నమ్మకంతోనే ఆ నిర్ణయం తీసుకున్నానని, లేదంటే ఈ సీజన్ కూడా ఆడేవాడినని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్‌కు ఇబ్బంది కలగొద్దని, తన వల్ల ఫ్రాంచైజీకి ₹10 కోట్లు మిగులుతాయనే భావించానన్నారు. మానసిక అలసట వల్లే గుడ్‌బై చెప్పాల్సి వచ్చిందని వివరించారు.
News April 6, 2026
భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయా.. అదెలా సర్?

ఉజ్జయినిలో భూమధ్య రేఖ, కర్కాటక రేఖ కలుస్తాయంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. 2 వేర్వేరు అక్షాంశాల్లో ఉండే లైన్స్ ఎలా కలుస్తాయని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ‘భూమధ్య రేఖ(Equator), కర్కాటక రేఖ(Tropic of Cancer).. సమాంతర రేఖలు. అవి కలవవు. మీరు BJPకి ఓటు వేస్తే విద్యావ్యవస్థను తీర్చిదిద్దేది ఇలాంటి వ్యక్తులే’ అని TMC నేత సాకేత్ గోఖలే ఎద్దేవా చేశారు.


