News July 23, 2024
వ్యవ‘సాయానికి’ రూ.1.52 లక్షలకోట్లు: నిర్మల
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల కోసం రూ.1.52 లక్షల కోట్లను కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ‘వచ్చే రెండేళ్లలో కోటిమంది రైతులు ప్రకృతి సేద్యాన్ని చేసేలా ప్రోత్సహిస్తాం. 400 జిల్లాల్లో డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహిస్తాం. 5 రాష్ట్రాల్లో కిసాన్ కార్డుల్ని అందిస్తాం. రొయ్యల పెంపకం, ఎగుమతికి నాబార్డు ద్వారా సాయం చేస్తాం’ అని నిర్మల తెలిపారు.
Similar News
News January 27, 2025
ఇంటిపై నుంచి బాలికను తోసేసి చంపిన కోతి
ఇంటి డాబాపై చదువుతున్న పదో తరగతి బాలికను కోతులు భయపెట్టి కిందకు తోసేసిన ఘటన బిహార్‌లోని సివాన్‌లో జరిగింది. విద్యార్థిని ప్రియ డాబాపై చదువుకుంటుండగా కోతుల గుంపు దాడి చేసింది. భయంతో ఆమె బిల్డింగ్ అంచులకు వెళ్లగా ఓ కోతి కిందకి తోసేసింది. తీవ్రంగా గాయపడ్డ ప్రియను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ కోతుల బెడద విపరీతంగా ఉంది.
News January 27, 2025
కిడ్నీ రాకెట్.. ప్రధాన సూత్రధారి అరెస్ట్
TG: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి డాక్టర్ పవన్ అలియాస్ లియోన్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి పారిపోయిన అతడితో పాటు మరో వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి, ఒక్కో సర్జరీకి రూ.50-60లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించింది.
News January 27, 2025
స్టాక్‌మార్కెట్లు విలవిల.. నిఫ్టీ 23,000 సపోర్టు బ్రేక్
దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 131 పాయింట్ల నష్టంతో 22,955 వద్ద చలిస్తోంది. కీలకమైన 23,000 సపోర్ట్ జోన్‌ను బ్రేక్ చేసింది. మరోవైపు సెన్సెక్స్ 440 పాయింట్లు పతనమై 75,774 వద్ద కొనసాగుతోంది. ఫియర్ ఇండెక్స్ ఇండియా విక్స్ 6.44% పెరిగి 17.83 వద్దకు చేరుకుంది. FMCG మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. BRITANNIA, HUL, ITC, ICICIBANK, NESTLE IND టాప్ గెయినర్స్.