News July 23, 2024
పరుగులు పెట్టనున్న అమరావతి పనులు

కేంద్ర బడ్జెట్లో కేటాయింపులతో రాజధాని <<13688307>>అమరావతి<<>>లో పనులు పరుగులు పెట్టనున్నాయి. ఐదేళ్ల తర్వాత అమరావతి నిర్మాణానికి రూ.15వేల కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. అవసరాలను బట్టి నిధులు పెంపు ఉంటుందని ప్రకటించిన నేపథ్యంలో రాజధానిలో అభివృద్ధి పరుగులు పెడుతుందని కూటమి నేతలు చెబుతున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే రాజధాని పనులు ప్రారంభిచామని, తాజా ప్రకటనతో AP అభివృద్ధి చెందుతుందని చెప్పారు.
Similar News
News November 10, 2025
గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్‌కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 9, 2025
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.