News July 23, 2024
బడ్జెట్‌లో ఈ తొమ్మిదింటికి మా ప్రాధాన్యం: నిర్మల

బడ్జెట్‌లో 9 అంశాలకు తాము అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అవి..
⇨ వ్యవసాయంలో ఉత్పాదకత పెంపు
⇨ ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల పెంపు
⇨ మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం
⇨ ఉత్పత్తి-సేవలు
⇨ పట్టణాభివృద్ధి
⇨ ఇంధన భద్రత
⇨ మౌలికవసతులు
⇨ ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి
⇨ అత్యాధునిక సంస్కరణలు
Similar News
News January 31, 2026
ఎగ్జిమ్ బ్యాంక్‌లో 40 పోస్టులు.. అప్లై చేశారా?

<
News January 31, 2026
ఈ సెషన్‌లోనే పార్లమెంట్‌కు అమరావతి బిల్లు?

AP: రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి క్లియరెన్స్ లభించింది. ఇప్పుడు న్యాయశాఖ, పట్టణాభివృద్ధి వంటి 4 కేంద్ర శాఖల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించాక బిల్లును ఈ పార్లమెంట్ సెషన్‌లోనే ప్రవేశ పెట్టడానికి కూటమి MPలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఆ బిల్లుపై YCP ఏ స్టాండ్ తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
News January 31, 2026
‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

TG: మున్సిపల్ ఎన్నికలతో ఇన్నాళ్ల మొండి బకాయిలు వసూలవుతున్నాయి. ఎలక్షన్స్‌లో పోటీ చేసే అభ్యర్థులకు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వారంతా పెండింగ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. నిజామాబాద్ 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శమంతనరేందర్ తమ వంశీ హోటల్‌కు సంబంధించి ఏకంగా రూ.7.50కోట్ల ఆస్తిపన్ను కట్టారు. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.50 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు.


