News July 23, 2024

INDతో T20 సిరీస్.. శ్రీలంక టీమ్ ఇదే

image

భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టును ప్రకటించింది. చరిత్ అసలంక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

* చరిత్ అసలంక (కెప్టెన్) పాతుమ్ నిస్సాంక, కుశాల్ జెనిత్ పెరెరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేశ్ చండీమల్, కమిందు మెండిస్‌, దసున్ షనక, వనిందు హసరంగ, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీర, బినుర ఫెర్నాండో

Similar News

News January 16, 2026

ట్యాపింగ్ కేసు.. ఇంకెంతకాలం విచారిస్తారు: సుప్రీం

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు విచారణకు గడువు ఇప్పటికే పూర్తయిందని, ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్‌ను ప్రశ్నించింది.

News January 16, 2026

ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటిన BJP కూటమి

image

BMC ఎన్నికల కౌంటింగ్‌లో BJP+ దూసుకుపోతోంది. ఏక్‌నాథ్ షిండే శివసేనతో కూడిన కూటమి మెజారిటీ మార్కును (114) దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 115 వార్డుల్లో ముందంజలో ఉంది. మరోవైపు ఠాక్రే సోదరుల కూటమి 77 వార్డుల్లో మాత్రమే ముందంజలో కొనసాగుతోంది. ఇక తమ కంచుకోట పుణే, పింప్రి చించ్వివాడ్‌లో ‘పవార్’ల పట్టు సడలినట్లు కనిపిస్తోంది. ఇక్కడ కూడా BJP హవానే కొనసాగుతోంది.

News January 16, 2026

ఎర్ర బెండ రకాల్లో ‘కాశీ లాలిమ’ ప్రత్యేకం

image

‘కాశీ లాలిమ’ ఎర్ర బెండను IIVR వారణాసి రూపొందించింది. ఈ కాయలు ఆకర్షణీయంగా ఉంటాయి. దీనికి కాయపుచ్చు పురుగు ముప్పు తక్కువ. దీని వల్ల పురుగు మందుల పిచికారీ అవసరం లేదు. చెట్టు పొట్టిగా ఉంటుంది. అందకే దగ్గర దగ్గరగా మొక్కలు నాటుకోవాలి. కాయపై దురద కలిగించే నూగు ఉండదు. అందుకే ఈ బెండ కాయలను సులభంగా కోయవచ్చు. పల్లాకు వైరస్ తెగులును ఇది సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఈ కాయల్లో జిగురు తక్కువగా ఉంటుంది.