News July 23, 2024

HYD: లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు

image

డీజీపీ జితేందర్ రెడ్డి అధ్యక్షతన HYD నగరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు.

Similar News

News January 17, 2026

గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎంట్రీ!

image

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నేడు పర్యాటక శాఖ నిర్వహించే ‘డ్రోన్ షో’కు సర్వం సిద్ధమైంది. ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే స్లాట్లన్నీ నిండిపోయినందున, రిజిస్ట్రేషన్ లేని వారు స్టేడియం వద్దకు రావొద్దని కోరారు. ఆ విన్యాసాలను మిస్ కాకుండా ఉండటానికి పర్యాటక శాఖ అందించే లైవ్ లింక్ ద్వారా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.

News January 17, 2026

సీఎం రూట్ అని తెలిసినా వినలేదు.. కేసు నమోదు

image

సీఎం రూట్ ఉన్న విషయం తెలిసి కూడా జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్ యజమాని అక్రమ పార్కింగ్లు చేశాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఫ్యాట్ పిజీయన్ పబ్ నిర్వాహకులు సీఎం రూట్ ఉందని చెప్పినా వినిపించుకోకుండా తమ కస్టమర్లతో వాహనాలను పార్కింగ్ చేయించడంతో సీఎం రూట్‌లో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పబ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 17, 2026

HYD: ఫేక్ టాబ్లెట్ గుర్తుపట్టడం ఎలా..?

image

HYDలో పలుచోట్ల నకిలీ మందులు విక్రయిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మందులు కొనుగోలు చేసే సమయంలో స్ట్రిప్‌‌పై బ్యాచ్ నంబర్, తయారీ, గడువు తేదీలు, కంపెనీ పేరు స్పష్టంగా ఉన్నాయా..? చూడాలి. బిల్ తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమానం వస్తే DGCA వెబ్‌సైట్‌లో బ్యాచ్ వివరాలు చెక్ చేయాలి. ఫిర్యాదులకు 18005996969 నంబర్‌కు కాల్ చేయండి.