News July 23, 2024
శక్తి క్యాంటీన్లు.. వారికి రూ.20 లక్షల వరకు లోన్

గ్రామీణ మహిళల అభ్యున్నతే లక్ష్యంగా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. MLG RDO ఆఫీసు, DVK, NKL MPDO ఆఫీసు, NLG కలెక్టరేట్, RDO కార్యాలయాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయించనున్నారు. ఆహార పదార్థాలను ఇళ్ల వద్ద తయారుచేసి క్యాంటీన్లకు తరలించడం, ఆర్డర్లపై పిండివంటలు, మిఠాయిలు, పచ్చళ్లను తయారుచేసి విక్రయిస్తారు. వ్యాపార దక్షత గల మహిళా సంఘాలకు రూ.10 నుంచి రూ.20 లక్షలు రుణంగా ఇవ్వనున్నారు.
Similar News
News February 21, 2026
నల్గొండ: నేతన్నలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం

2026 జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని ‘శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ’ రాష్ట్ర అవార్డులకు దరఖాస్తులు కోరుతున్నారు. 30 ఏళ్ల వయస్సు, 10 ఏళ్ల అనుభవం ఉన్న చేనేత కళాకారులు; 25 ఏళ్ల వయస్సు, 5 ఏళ్ల అనుభవం ఉన్న డిజైనర్లు అర్హులు. ఆసక్తి గలవారు మార్చి 31, 2026 లోపు జిల్లా చేనేత కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
News February 21, 2026
NLG: మరో వారం రోజులే గడువు

ఫార్మర్ రిజిస్ట్రీకి మరోవారం రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
News February 21, 2026
నల్గొండ: ఆందోళన కలిగిస్తున్న మరణాలు

నల్గొండ జిల్లాలో శుక్రవారం విషాదం నిండిన రోజుగా మిగిలింది. వేర్వేరు ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఆందోళన కలిగిస్తున్నాయి. మామిడాలలో అప్పుల బాధతో సంతోశ్ ఉరివేసుకోగా, తెట్టకుంటలో మానసికస్థితి సరిగా లేక నర్సమ్మ నిప్పంటించుకుని మృతి చెందింది. నకిరేకల్‌లో గీత కార్మికుడు వెంకటేశం చెట్టుపై నుంచి పడి, మండలాపురంలో తల్లిదండ్రులు మందలించారని మహేశ్ గడ్డిమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.


