News July 23, 2024
బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యి

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్ 2024-25లో తెలంగాణకు ప్రత్యేకంగా నిధుల కేటాయింపులేమీ జరగలేదు. ఎన్డీయే భాగస్వాములైన ఏపీ, బీహార్‌తో పాటు అస్సాంకు ప్రాధాన్యం కనిపించింది. రైలు మార్గాలు లేని జిల్లాలకు కొత్త ట్రాక్‌లు వస్తాయనే ఆశలు మరోసారి అడియాసలయ్యాయి. బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ ఊసే ఎత్తలేదు.
Similar News
News April 3, 2026
ఒత్తైన జుట్టు కోసం ఉసిరి నూనె

మన పూర్వీకులు తరతరాలుగా కురుల ఆరోగ్యం కోసం ఉసిరి నూనెను వాడుతున్నారు. ఈ నూనె వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కురుల పెరుగుదలను వృద్ధి చేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని యాంటీ యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు రాలకుండా చూస్తాయి. కురులు తేమగా, మెరిసేలా చేస్తాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతుంటే ఉసిరి నూనెలోని యాంటీ మైక్రోబియల్ గుణం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
News April 3, 2026
ఐరన్ టాబ్లెట్లు ఎప్పుడు తీసుకోవాలంటే

ఐరన్ లోపించినప్పుడు, శరీరం అవసరం మేరకు ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయలేదు. దీనివల్ల కణజాలాలకు, అవయవాలకు తగినంత ఆక్సిజన్ అందదు. దీనికోసం ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి. వీటిని పరగడపున తీసుకుంటే చక్కగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. ఐరన్‌తో పాటు వేరే మందులు తీసుకోవద్దు. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్న గంట వరకూ డెయిరీ ప్రోడక్ట్స్ అయిన పాలు, పెరుగు వంటివి తీసుకోకూడదని చెబుతున్నారు.
News April 3, 2026
ఏ దేశ ప్రజలకు ఎక్కువ సెక్స్ పార్ట్‌నర్స్ ఉన్నారంటే?

అత్యధిక లైంగిక భాగస్వాములను కలిగిన దేశాల లిస్ట్‌లో తుర్కియే టాప్‌లో ఉంది. ఇక్కడి పౌరుల లైంగిక భాగస్వాముల సగటు 14.5గా ఉన్నట్లు వరల్డ్ పాపులేషన్ రివ్యూ చెబుతోంది. తుర్కియే తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా (13.3), న్యూజిలాండ్ (13.2), ఐస్‌లాండ్ (13.0), సౌతాఫ్రికా (12.5) ఉన్నాయి. ఇక అతితక్కువ సెక్స్ పార్ట్‌నర్స్ కలిగిన దేశంగా భారత్(3) నిలిచింది.


