News July 23, 2024
చారిత్రక నిర్ణయం : ఏంజిల్ ట్యాక్స్ రద్దు

పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల ఇన్వెస్టర్లకు ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేసింది. అలాగే విదేశీ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 40 నుంచి 35 శాతానికి కుదించింది. దీంతో స్టార్టప్‌లు, అన్ లిస్టెడ్ కంపెనీలు పెట్టుబడిని సమీకరించే అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఏంజిల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు లబ్ధి చేకూరుతుంది.
Similar News
News January 2, 2026
టికెట్ కొనాల్సిందే.. ఇంద్రకీలాద్రిపై కొత్త విధానం!

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. సిఫార్సుల ద్వారా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ టికెట్లు కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ భావిస్తున్నారు. ఈ మార్పు వలన ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. దుర్గగుడికి సిఫార్సుల జాబితాలో దర్శనాలకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News January 2, 2026
అయ్యప్ప యోగ ముద్ర వెన్నెముకకు రక్ష

అయ్యప్ప స్వామి కూర్చునే స్థితి ఓ ఆసనమే కాదు! వెన్నెముక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన మార్గం కూడా! ఈ స్థితిలో కూర్చోవడం వల్ల వెన్నుపాము నిటారుగా ఉండి, మన శరీరంలోని ప్రాణశక్తి కింద నుంచి పైకి సాఫీగా ప్రవహిస్తుంది. దీనివల్ల నడుము నొప్పి దరిచేరదు. నరాల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఈ భంగిమ మనస్సును నిలకడగా ఉంచి, ఏకాగ్రతను పెంచుతుంది. యోగ శాస్త్రం ప్రకారం.. ఇది అంతర్గత అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది.
News January 2, 2026
మహిళలపై తీవ్ర ప్రభావం

రోజువారీ పనుల్లో పడి మహిళలు ఆరోగ్యంలో వచ్చే మార్పులపై దృష్టి పెట్టరు. దీంతో PCOD, మొటిమలు, సంతానలేమి, బరువు పెరగడం, జుట్టురాలడం వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, జన్యుమార్పులు, జీవనశైలి, మద్యపానం, ధూమపానం కారణంగా మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. మెనోపాజ్ దశలో అండాల ఉత్పత్తి నిలిచిపోవడం, ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గిపోవడం వల్లమానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.


