News July 23, 2024
HYD: 3 రోజులు స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా 3 రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(AISF) హయత్‌నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్, గ్రేటర్ HYD నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు మాట్లాడారు. ఆన్‌లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాలని కోరారు. నాయకులు ఎన్నపల్లి ఉపేందర్, జిన్నా, బన్నీ, జూనోతల భాను ప్రకాశ్ ఉన్నారు.
Similar News
News January 17, 2026
లక్కీ డ్రా ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్త: సీపీ సజ్జనార్

సోషల్ మీడియాలో కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు ఇస్తామంటూ లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలు అంటూ కొత్త వేషాలతో వీళ్లు దర్శనమిస్తున్నారని ఫైరయ్యారు. అమాయకపు ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్న ఇన్ఫ్లూయెన్సర్లపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
News January 17, 2026
హైదరాబాద్ మెట్రో ఇక సర్కారు సొంతం!

HYD మెట్రోలో కొత్త అధ్యాయం మొదలైంది. L&T కున్న రూ.13,000 కోట్ల అప్పును ప్రభుత్వం స్వీకరిస్తూ, మరో ₹2,000 కోట్లను వాటా కింద చెల్లించి ప్రాజెక్టును పూర్తిగా స్వాధీనం చేసుకోనుంది. దీంతో మెట్రో నిర్వహణ, టికెట్ ధరలు, విస్తరణపై ప్రభుత్వానికి పూర్తి అధికారం దక్కనుంది. ఈ ప్రక్రియను మార్చి 2026 నాటికి పూర్తి చేసి మెట్రోను ప్రజలకు మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
News January 17, 2026
గచ్చిబౌలిలో రిజిస్ట్రేషన్ ఉంటేనే ఎంట్రీ!

గచ్చిబౌలి స్టేడియం వేదికగా నేడు పర్యాటక శాఖ నిర్వహించే ‘డ్రోన్ షో’కు సర్వం సిద్ధమైంది. ముందస్తుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే స్లాట్లన్నీ నిండిపోయినందున, రిజిస్ట్రేషన్ లేని వారు స్టేడియం వద్దకు రావొద్దని కోరారు. ఆ విన్యాసాలను మిస్ కాకుండా ఉండటానికి పర్యాటక శాఖ అందించే లైవ్ లింక్ ద్వారా వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.


