News July 23, 2024
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం, వెండిపై కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ఏకంగా రూ.2,990 తగ్గి, రూ.70,860కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.2,750 తగ్గి రూ.64,950గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ రూ.3500 తగ్గి రూ.88 వేలకు చేరింది.
Similar News
News November 8, 2025
వంటింటి చిట్కాలు

* ఉప్పు నిల్వ చేసే డబ్బాలో అడుగున బ్లాటింగ్ పేపర్ వేస్తే.. ఉప్పు తేమగా మారదు.
* అల్లం, వెల్లుల్లి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే.. కాగితంలో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
* కొత్త బంగాళదుంపలు ఉడికించేటప్పుడు నాలుగు పుదీనా ఆకులు వేస్తే మట్టి వాసన రాదు.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
News November 8, 2025
జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ 5 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్‌సైట్: https://cujammu.ac.in/
News November 8, 2025
DANGER: ఇయర్‌ఫోన్లు అధికంగా వాడుతున్నారా?

శరీరంలో ఇయర్‌ఫోన్ భాగమైపోయిందా అన్నట్లు కొందరు ఉదయం నుంచి రాత్రి వరకూ దానిని వాడుతుంటారు.. అలా గత మూడేళ్లుగా రోజుకు 12గంటలు ఇయర్‌ఫోన్లు వాడిన ఓ యువతి తీవ్ర అనారోగ్యానికి గురైంది. వినికిడి తగ్గిపోవడం, ‘టిన్’ శబ్దం వినిపించడంతో ఆమె ENT ఆస్పత్రికి వెళ్లగా చెవిలో పొర ఇన్‌ఫెక్ట్ అయి చీము చేరిందని వైద్యులు తెలిపారు. ఇయర్‌ఫోన్ అతి వినియోగం వినికిడి శక్తిని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు.


