News July 23, 2024
నష్టాల నుంచి పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
స్టాక్‌మార్కెట్ సూచీలు స్తబ్ధుగా ముగిశాయి. 80,724 వద్ద మొదలైన BSE సెన్సెక్స్ ఒకానొక దశలో 1000 పాయింట్ల నష్టంతో 79,224 వద్ద కనిష్ఠాన్ని తాకింది. తర్వాత పుంజుకొని 80,766 వద్ద గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 73 పాయింట్ల నష్టంతో 80,429 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 24,074 వద్ద కనిష్ఠ, 24,582 వద్ద గరిష్ఠ స్థాయుల్ని తాకింది. 30 పాయింట్ల నష్టంతో 24,479 వద్ద క్లోజైంది. టైటాన్, ఐటీసీ షేర్లు 6.5% మేర ఎగిశాయి.
Similar News
News October 31, 2024
వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ
AP: రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు 600 మందికి సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం ఆలయాల నుంచి సంభావన చెల్లించాలని పేర్కొంది. ఈ సాయం పొందే పండితులు వారి నివాసానికి సమీపంలోని ఆలయంలో రోజూ గంటపాటు వేద పారాయణం చేయాలంది.
News October 31, 2024
ఈ ఆలయం దీపావళి రోజు మాత్రమే తెరుస్తారు
కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబా ఆలయంలో దుర్గాదేవి హసనాంబాదేవిగా పూజలందుకుంటారు. ప్రతి సంవత్సరం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయం తెరుస్తారు. దీపావళి రోజు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. అవి పదిరోజుల పాటు కొనసాగుతాయి. ఉత్సవాల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. మీ ప్రాంతంలో ఇలాంటి ఆలయాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.
News October 31, 2024
మాజీ మంత్రి అప్పలరాజుకు తీవ్ర అస్వస్థత
AP: మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.